దేశంలో గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. జూలై 12 తేదీ గురువారం బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 77 రూపాయిలు పెరిగింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.9,977 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 65 రూపాయిలు పెరిగి 9,140 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర 54 రూపాయిలు పెరిగి రూ.7,479 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 7,100 పెరిగి రూ. 9,97,100 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.6,500 పెరిగి రూ. 9,14,00 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర రూ. 5,400 పెరిగి రూ. 7, 47,900 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇక . చైనా కనుక ఓ కీలక నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో బంగారం ధర రూ. 30 వేల వరకు తగ్గుతుందని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చైనా వద్ద అపారమైన బంగారం నిల్వలు ఉన్నాయి. అయితే అదే సమయంలో ఆర్థిక సంక్షోభం కూడా చైనాను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో చైనా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి తన వద్ద ఉన్న బంగారాన్ని బహిరంగ మార్కెట్లో వేలానికి పెడితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
చైనా తీసుకునే ఈ ఒక్క నిర్ణయం వల్ల బంగారం ధర రూ. 30,000 తగ్గుతుందనే వాదన అందరికీ అతిశయోక్తి కావచ్చు. అయితే మార్కెట్లో చైనా చర్యలు బంగారం ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపగలవు. ప్రపంచ బంగారు మార్కెట్లో చైనా ప్రధాన పాత్ర పోషిస్తోంది.దిగుమతి కోటాల్లో మార్పులు లేదా ప్రభుత్వ విధానాలు వంటి దాని చర్యలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.అమెరికా - చైనా మధ్య వాణిజ్య ఒప్పందం బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది. వాణిజ్య చర్చల నుండి వచ్చే సానుకూల సంకేతాలు పెట్టుబడిదారుల భయాన్ని తగ్గిస్తాయి. సురక్షితమైన ఆస్తిగా బంగారం ఆకర్షణను తగ్గిస్తాయి. ఇది ధర తగ్గుదలకు దారితీస్తుంది.
బంగారం ధరలను గతేదాడి నుంచి మనం చూసుకున్నట్లయితే 75 వేల నుంచి 95 వేల వరకు చేరుకుంది. ఏడాది కాలంలోనే 25 వేల నుంచి 35 వేల వరకు బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం ధర పెరగడానికి చైనానే ప్రధాన కారణమని చెప్పక తప్పదు. ఎందుకంటే గడిచిన పదేళ్లలో చైనా విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేసింది. ఎక్కువగా తన పెట్టుబడులను బంగారం రూపంలో నిల్వ చేసుకునేందుకే ఆసక్తి చూపింది. అమెరికా డాలర్ మీద ఆధారపడకుండా ఉండేందుకు చైనా ఇలా బంగారాన్ని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సెంట్రల్ బ్యాంకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రతి సంవత్సరం దాదాపు 100 టన్నుల చొప్పున ..గడిచిన పదేళ్లలో దాదాపు 1000 మెట్రిక్ టన్నుల వరకు బంగారాన్ని కొనుగోలు చేసిందని సమాచారం. ఒక్క 2023లోనే చైనా దాదాపు 250 టన్నుల వరకు బంగారం కొనుగోలు చేసిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూసుకున్నట్లయితే ప్రస్తుతం చైనా వద్ద దాదాపు 2300 టన్నుల బంగారం నిల్వలో ఉంది.
ప్రపంచ స్టాక్ మార్కెట్లు దెబ్బ తిన్నప్పుడల్లా చైనా.. బంగారం మీద ఎక్కువగా పెట్టుబడులను పెట్టుకుంటూ పోయింది. అలాగే పశ్చిమ దేశాల మీద ఆధార పడకుండా ఉండేందుకు కూడా బంగారం మీద చైనా తన దృష్టిని పెట్టింది. దీంతో బంగారం ధరలు పెరగడం ప్రారంభించాయి. గడిచిన పదేళ్లలో దాదాపు బంగారం ధర మూడు రెట్లు పెరగగా..కేవలం 5 ఏళ్లలోనే రెట్టింపు అయింది.
ఇక కరోనా సంక్షోభంతో ప్రపంచ దేశాలు అల్లాడుతుంటే చైనా మాత్రం బంగారం మీద తన ఫోకస్ పెట్టింది. కరోనా తర్వాత కూడా బంగారం మీదనే ఫోకస్ పెట్టింది.తాజాగా చైనా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే ఏకైక మార్గం నిల్వలో ఉన్న బంగారాన్ని బహిరంగ మార్కెట్లో పెట్టడమే.. తద్వారా చైనా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటమే కాకుండా బంగారం ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.


Click it and Unblock the Notifications