బంగారం ముట్టుకుంటేనే షాక్ కొడుతోంది. పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తోంది. పండుగ సీజన్ సమీపించే కొద్దీ బంగారం ధరలు నింగిని తాకుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ ముహర్తానా సుంకాల దాడి మొదలు పెట్టారో గాని అప్పటి నుంచి Gold సామాన్యుల చేతికి అందనత దూరంలోకి వెళ్లింది. ప్రస్తుతం 0 గ్రాముల 24K బంగారం ధర ఏకంగా రూ. 1.03 లక్షల మార్కును దాటి సరికొత్త రికార్డును నెలకొల్పింది.
పండుగ సీజన్ డిమాండ్, అనిశ్చిత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణ ఆందోళనలతో పాటుగా బలహీనమైన ప్రపంచ ఆర్థిక దృక్పథం వంటి అంశాలు పసిడి పెరుగుదలకు కారణమవుతున్నాయి. పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన డిమాండ్ గా పరిగణిస్తూ..ముందుకు వెళుతున్నారు. డాలర్ ను వదిలేసి బంగారం మీదనే ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టారు. అందువల్ల ఈ సీజన్‌లో అత్యంత డిమాండ్ ఉన్న వస్తువులలో ఒకటిగా బంగారం మారింది.

ధరలు మరింత పెరగకముందే పెట్టుబడిదారులు, ఆభరణాల కొనుగోలుదారులు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు తొందరపడుతున్నారు.ఈ నేపథ్యంలోనే పండుగ, వివాహాల సీజన్ దేశీయ వినియోగాన్ని పెంచడంతో పాటుగా రాబోయే వారాల్లో ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది లేదా మరింత పెరగవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు సద్దుమణిగితే బంగారం రూ. 90 వేలకు దిగివస్తుందని బ్యాకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.
భారతదేశంలో నేడు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.10,331గా ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.9,470 వద్ద టరేడ్ అవుతోంది. 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.7,749 వద్ద ట్రేడ్ అవుతోంది. భారతదేశంలో నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,03,310 వద్ద నమోదైంది. అంతకు ముందు రోజు రూ.1,02,550 వద్ద బంగారం ధర ట్రేడ్ అయింది. ఇక 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.10,33,100గా ఉంది. ఇది ఇప్పటివరకు పలికిన అత్యధిక ధరగా చెప్పుకోవచ్చు.
MCX గోల్డ్ ప్రస్తుతం రోజువారీ చార్టులో స్పష్టమైన అప్‌ట్రెండ్‌లో Gold Rate కొనసాగుతోంది. Gold ధర తన ఆల్-టైమ్ హై స్థాయిల సమీపంలో బలంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న వాణిజ్యపరమైన నిర్ణయాలు అంతర్జాతీయంగా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా చిప్ దిగుమతులపై 100% సుంకం విధించాలనే హెచ్చరిక బంగారం ధరలను పైకి పెంచింది.ఈ నేపథ్యంలోనే ఈ జియోపాలిటికల్ అనిశ్చితి, ఫెస్టివ్ డిమాండ్ వల్ల బంగారం ధరలు సమీప కాలంలో బలంగా నిలిచే అవకాశం ఉందని నిర్మల్ బ్యాంగ్ సెక్యూరిటీస్ విశ్లేషకులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

Gold rates: బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు! తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలివే..

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఆఫర్లు.. బంగారం, డైమండ్లపై భారీ డిస్కౌంట్లు!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications