Gold News: ఫెడ్ చైర్ పావెల్ మాటలతో భగ్గుమన్న బంగారం.. ఏమైందంటే..?
Jerome Powell: ఫిబ్రవరి మధ్య నుంచి బంగారం ధరల్లో పెరుగుదల ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న పసిడి ధర సరికొత్త గరిష్ఠాలకు చేరుకుంటోంది.
ఈ ధోరణితో ఇప్పటికే ప్రజలు అయోమయంలో ఉన్నారు. ముఖ్యమైతే తప్ప బంగారం కొనుగోళ్లను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. తాజాగా యూఎస్ సెంట్రల్ బ్యాంక్ చైర్ జెరోమా పావెల్ చేసిన కామెంట్స్ బంగారం ధరలను భగ్గుమనిపించాయి. దీంతో గతంలో ఎన్నడూ చూడని విధంగా గోల్డ్ ధర ఔన్సుకు 2,300 డాలర్లను అధిగమించింది. ఈవారం వరుస పెరుగుదల నిజంగా ఆందోళనకు గురిచేస్తోంది.

వాస్తవానికి ఈ ఏడాదిలో యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు బంగారం ధరలను బలపరుస్తున్నాయి. చాలా మంది ఇన్వెస్టర్లు వడ్డీ రేట్లు తగ్గుతాయనే ఆలోచనతో తమ పెట్టుబడులను బంగారంలోకి మళ్లిస్తున్నారు. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల నుంచి కొనసాగుతున్న షాపింగ్ కూడా పసిడి పరుగులకు పరోక్షంగా కారణమౌతోందని నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు ముందుగానే తమ డబ్బును బ్యాంక్ ఎఫ్‌డిల నుంచి బంగారంలో పార్క్ చేసేందుకు హడావిడిగా ఉన్నారు.
ఇదే సమయంలో వెండి ధరలు సైతం భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వెండి రేట్లు దాదాపు మూడేళ్ల గరిష్ఠానికి చేరువలో ఉండటం గమనార్హం. వాస్తవానికి నిన్న వడ్డీ రేట్ల తగ్గింపుపై జెరోమ్ పావెల్ మాట్లాడుతూ.. వడ్డీ రేట్లను తగ్గించటం ఈ ఏడాది ఏదో ఒక సమయంలో సముచితమైనగా భావిస్తున్నట్లు అన్నారు. దీంతో పావెల్ హామీతో బంగారం ధరలు ఒక్కసారిగా తిరిగి పుంజుకోవటం ప్రారంభించాయి.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సంకలనం చేసిన తాజా డేటా ప్రకారం, ఫిబ్రవరిలో సెంట్రల్ బ్యాంకులు తమ బంగారం నిల్వలను జోడించడం కొనసాగించాయి. వారు వరుసగా 9 నెలల పాటు గోల్డ్ కొనుగోళ్లను కొనసాగించారని వల్లడైంది. వీటితో చైనా ముందు స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో భారత్, కజకిస్తాన్‌లు నిలిచాయి.


Click it and Unblock the Notifications