Gold Price Today: కొంత కాలంగా విపరీతంగా పెరుగుతూ సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బంగారం ధరలు నేడు చల్లారాయి. దీనికి తోడు వారాంత సెలవు కావటంతో చాలా మంది ప్రజలు తమ ఉగాది షాపింగ్ మెుదలుపెట్టాలని యోచిస్తున్నారు.
నేడు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.250 క్షీణతను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.63,700, ముంబైలో రూ.62,750, దిల్లీలో రూ.62,900, కలకత్తాలో రూ.62,750, బెంగళూరులో రూ.62,750, కేరళలో రూ.62,750, వడోదరలో రూ.62,800, జైపూరులో రూ.62,900, లక్నోలో రూ.62,900, మంగళూరులో రూ.62,750, నాశిక్ లో రూ.62,780, అయోధ్యలో రూ.62,900, నోయిడాలో రూ.62,900, గురుగ్రాములో రూ.62,900 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు నిన్నటికంటే రూ.280 తగ్గుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.69,490, ముంబైలో రూ.68,450, దిల్లీలో రూ.68,600, కలకత్తాలో రూ.68,450, బెంగళూరులో రూ.68,450, కేరళలో రూ.68,450, వడోదరలో రూ.68,500, జైపూరులో రూ.68,600, లక్నోలో రూ.68,600, మంగళూరులో రూ.68,450, నాశిక్ లో రూ.68,480, అయోధ్యలో రూ.68,600, నోయిడాలో రూ.68,600, గురుగ్రాములో రూ.68,600గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.62,750గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.68,450 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.200 పెరిగి రూ.81,000 వద్ద కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications