Gold Price Today: దీపావళి పండుగ ముగియగానే దేశీయంగా బంగారం ధరలు భగ్గుమన్నాయి. గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగినప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్లను అనుకరిస్తూ నేడు తగ్గుదలను నమోదు చేశాయి.
దీంతో 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటికంటే 10 గ్రాములకు రూ.50 క్షీణించింది. దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన తాజా రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.57,050, ముంబైలో రూ.56,500, దిల్లీలో రూ.56,650, కలకత్తాలో రూ.56,500, బెంగళూరులో రూ.56,500, కేరళలో రూ.56,500, వడోదరలో రూ.56,550, జైపూర్‌లో రూ.56,650, కోయంబత్తూరులో రూ.57,050, నాశిక్‌లో రూ.56,530, మైసూరులో రూ.56,500, బళ్లారిలో రూ.56,500, గురుగ్రామ్‌లో రూ.56,650, నోయిడాలో రూ.56,650గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటి కంటే 10 గ్రాములకు స్వల్పంగా రూ.50 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రిటైల్ తాజా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.62,230, ముంబైలో రూ.61,640, దిల్లీలో రూ.61,790, కలకత్తాలో రూ.61,640, బెంగళూరులో రూ.61,640, కేరళలో రూ.61,640, వడోదరలో రూ.61,690, జైపూర్‌లో రూ.61,790, కోయంబత్తూరులో రూ.62,230, నాశిక్‌లో రూ.61,690, మైసూరులో రూ.61,640, బళ్లారిలో రూ.61,640, గురుగ్రామ్‌లో రూ.61,790, నోయిడాలో రూ.61,790గా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కడప, అనంతపురం, విశాఖ, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,500గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,640గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీ వెండి ధర రూ.79,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications