Gold Rate Today: దేశీయంగా పసిడి ప్రియులకు గత వారం రోజులుగా పెరుగుతున్న ధరలు దడ పుట్టిస్తున్నాయి. వాస్తవానికి అంతర్జాతీయ పరిణామాలు దీనికి ప్రధాన కారణంగా ఉన్నాయి. అయితే నేడు పరిస్థితులు కొద్దిగా మెరుగుపడ్డాయి.
22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటి కంటే నేడు స్వల్పంగా రూ.10 క్షీణతను నమోదు చేసింది. దీనికి ముందు ధరల్లో స్థిరత్వం వస్తున్నట్లు కనిపించింది. దీంతో షాపింగ్ చేసేవారు నేడు దేశంలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.61,490, ముంబైలో రూ.60,740, దిల్లీలో రూ.60,890, కలకత్తాలో రూ.60,740, బెంగళూరులో రూ.60,740, కేరళలో రూ.60,740, పూణేలో రూ.60,740, వడోదరలో రూ.60,790, జైపూరులో రూ.60,890, మంగళూరులో రూ.60,740, నాశిక్ లో రూ.60,770, అయోధ్యలో రూ.60,890, గురుగ్రాములో రూ.60,890, బళ్లారిలో రూ.60,740గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు నేడు రూ.10 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో రిటైల్ తాజా విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.67,090, ముంబైలో రూ.66,260, దిల్లీలో రూ.66,410, కలకత్తాలో రూ.66,260, బెంగళూరులో రూ.66,260, కేరళలో రూ.66,260, పూణేలో రూ.66,260, వడోదరలో రూ.66,310, జైపూరులో రూ.66,410, మంగళూరులో రూ.66,260, నాశిక్ లో రూ.66,310, అయోధ్యలో రూ.66,410, గురుగ్రాములో రూ.66,410, బళ్లారిలో రూ.66,260గా కొనసాగుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖ, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, కడప, అనంతపురం, గుంటూరు, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ ప్రాంతాల్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.60,740గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.66,260గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఏపీ, తెలంగాణలో వెండి ధరను పరిశీలిస్తే.. కేజీకి రేటు రూ.500 పెరిగి రూ.79,500గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications