Gold Price Today: గతవారంలో ఒక్కసారి మాత్రమే తగ్గిన పసిడి ధరలు మళ్లీ తిరిగి వరుస పెరుగుదలను కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే అక్షయ తృతీయ దగ్గరపడుతున్న వేళ కొత్త వారంలో గోల్డ్ రేట్లు తగ్గటం ప్రారంభించినట్లు కనిపిస్తోంది.
ఈ క్రమంలో 22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు రూ.3000 క్షీణతను నమోదు చేసింది. అక్షయతృతీయ దగ్గరపడుతున్న వేళ పసిడి ప్రియులు రేటు తగ్గినప్పుడే కొంత కొనుక్కోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో తగ్గిన పసిడి రిటైల్ విక్రయ ధర 10 గ్రాములకు గమనిస్తే.. చెన్నైలో రూ.67,400, ముంబైలో రూ.66,550, దిల్లీలో రూ.66,700, కలకత్తాలో రూ.66,550, బెంగళూరులో రూ.66,550, కేరళలో రూ.66,550, వడోదరలో రూ.66,600, జైపూరులో రూ.66,700, నాశిక్ లో రూ.66,580, మంగళూరులో రూ.66,550, అయోధ్యలో రూ.66,700, గురుగ్రాములో రూ.66,700, నోయిడాలో రూ.66,700 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు రూ.3,300 తగ్గుదలను నేడు నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో తగ్గిన 10 గ్రాముల రిటైల్ విక్రయ ధరను పరిగణిస్తే.. చెన్నైలో రూ.73,530, ముంబైలో రూ.72,600, దిల్లీలో రూ.72,750, కలకత్తాలో రూ.72,600, బెంగళూరులో రూ.72,600, కేరళలో రూ.72,600, వడోదరలో రూ.72,650, జైపూరులో రూ.72,750, నాశిక్ లో రూ.72,630, మంగళూరులో రూ.72,600, అయోధ్యలో రూ.72,750, గురుగ్రాములో రూ.72,750, నోయిడాలో రూ.72,750గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.66,550గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,600 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర స్థిరంగా కేజీకి నేడు రూ.87,500గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications