Gold Rate: కార్తీక మాసం శుభవార్త.. రెండో రోజూ కుప్పకూలిన గోల్డ్ రేటు.. ఏపీ, తెలంగాణలో రేట్లివే..
Gold Price Today: దేశీయంగా గోల్డ్ ధరలు దీపావళి తర్వాత నిరంతరం క్షీణిస్తున్నాయి. నేడు కార్తీకమాసం తొలిరోజు కావటంతో పసిడి కొనాలని ప్లాన్ చేసుకుంటున్న చాలా మంది రెండు రోజులుగా ధరల పతనం కొనసాగటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పండుగల సీజన్‌తో పాటు పెళ్లిళ్లు జరుగుతున్న వేళ ఆభరణాల షాపింగ్ చేయాలని భావిస్తున్న చాలా మంది వారాంతంలో షాపింగ్ షురూ చేసేందుకు వెళుతున్న వేళ రేట్ల తగ్గింపు సంతోషం నింపుతోంది.
22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.1500 తగ్గుదలను చూస్తోంది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7370, ముంబైలో రూ.7370, దిల్లీలో రూ.7380, కలకత్తాలో రూ.7370, బెంగళూరులో రూ.7370, కేరళలో రూ.7370, వడోదరలో రూ.7375, అహ్మదాబాదులో రూ.7375, జైపూరులో రూ.7380, లక్నోలో రూ.7380, మంగళూరులో రూ.7370, నాశిక్ లో రూ.7373, అయోధ్యలో రూ.7380, బళ్లారిలో రూ.7370, గురుగ్రాములో రూ.7380, నోయిడాలో రూ.7380 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. పైన పేర్కొన్న ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి, షాప్ యజమాని లాభాలు వంటివి కలపక ముందు రేట్లు.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.1600 తగ్గింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ ధరలను పరిగణిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8040, ముంబైలో రూ.8040, దిల్లీలో రూ.7380, కలకత్తాలో రూ.8040, బెంగళూరులో రూ.8040, కేరళలో రూ.8040, వడోదరలో రూ.8045, అహ్మదాబాదులో రూ.8045, జైపూరులో రూ.8055, లక్నోలో రూ.8055, మంగళూరులో రూ.8040, నాశిక్ లో రూ.8043, అయోధ్యలో రూ.8055, బళ్లారిలో రూ.8040, గురుగ్రాములో రూ.8055, నోయిడాలో రూ.8055గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7370గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8040 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7370గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8040 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,06,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు, మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది.


Click it and Unblock the Notifications