Gold Rate: శనివారం తగ్గిన గోల్డ్ రేటు.. షాపింగ్ కోసం రైట్ టైమ్, రూ.1100 తగ్గిన ధర..
Gold Price Today: ఇటీవలి అమెరికా ఎన్నికల హడావిడి ముగియటంతో క్రమంగా పసిడి ధరలు తిరిగి సామాన్యులకు అందుబాటు స్థాయిలకు వస్తున్నాయి. ట్రంప్ విక్టరీ తర్వాత భారీగానే పడిన గోల్డ్ రేట్లు తర్వాత పుంజుకున్నప్పటికీ నేడు మళ్లీ ధరల పతనం కొనసాగింది. దీంతో శనివారం, ఆదివారం ఇవే ధరలు దేశంలో కొనసాగుతున్నందున వారాంతంలో కొనుగోలు చేపట్టాలని చూస్తున్న వారికి ఊరటనిచ్చే అంశంగా ఉంది. దీంతో పెళ్లి షాపింగ్ చేస్తున్న లక్షల మంది దీనిని వినియోగించుకోవాలని చూస్తున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1000 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7275, ముంబైలో రూ.7275, దిల్లీలో రూ.7290, కలకత్తాలో రూ.7275, బెంగళూరులో రూ.7275, కేరళలో రూ.7275, పూణేలో రూ.7275, వడోదరలో రూ.7280, అహ్మదాబాదులో రూ.7280, జైపూరులో రూ.7290, లక్నోలో రూ.7290, మధురైలో రూ.7275, సూరత్ రూ.7280, మంగళూరులో రూ.7286, నాశిక్ లో రూ.7289, అయోధ్యలో రూ.7301, బళ్లారిలో రూ.7275, గురుగ్రాములో రూ.7290, నోయిడాలో రూ.7290, వెల్లూరులో రూ.7275 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే రూ.1100 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈమేరకు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ రేట్లను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7936, ముంబైలో రూ.7936, దిల్లీలో రూ.7951, కలకత్తాలో రూ.7936, బెంగళూరులో రూ.7936, కేరళలో రూ.7936, పూణేలో రూ.7936, వడోదరలో రూ.7941, అహ్మదాబాదులో రూ.7941, జైపూరులో రూ.7951, లక్నోలో రూ.7951, మధురైలో రూ.7936, సూరత్ రూ.7280, మంగళూరులో రూ.7948, నాశిక్ లో రూ.7951, అయోధ్యలో రూ.7963, బళ్లారిలో రూ.7936, గురుగ్రాములో రూ.7951, నోయిడాలో రూ.7951, వెల్లూరులో రూ.7936 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7275గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7936 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7275గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7936 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,03,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది. పైన పేర్కొన్న ధరలకు జీఎస్టీ, తరుగు, వ్యాపారి లాభాలు, మజూరి వంటివి కలపకముందు రేట్లుగా గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications