Gold Rates: అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ఆర్థిక కల్లోలం బంగారం ధరలను కుదురుగా ఉండనివ్వటం లేదు. గతవారం పసిడి పడుగులు చూస్తే చాలా మందికి గుండే ఆగినంత పనైంది. జీవితకాల గరిష్ఠాలకు వేగంగా ఎగబాకిన బంగారం.. తాజాగా తగ్గుదలతో వినియోగదారులకు స్వల్ప ఊరటను కల్పిస్తోంది.
ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరలను గమనిస్తే నిన్నటితో పోల్చితే రూ.760 తగ్గాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో రేట్లను గమనిస్తే.. చెన్నైలో రూ.62,090, ముంబైలో రూ.61,640, దేశ రాజధాని దిల్లీలో రూ.61,790, కోల్‌కత్తాలో రూ.61,640, బెంగళూరులో రూ.61,690, కేరళలో రూ.61,640, కోయంబత్తూరులో రూ.62,090, సూరత్ లో రూ.61,690గా ఉన్నాయి.

ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధరలను గమనించినట్లయితే ఒక్కరోజులో దాదాపు రూ.700 మేర తగ్గాయి. ఇక దేశంలోని వివిధ నగరాల్లో పసిడి తాజా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.56,920, ముంబైలో రూ.56,500, దిల్లీలో రూ.56,650, కోల్‌కత్తాలో రూ.56,500, బెంగళూరులో రూ.56,550, కేరళలో రూ.56,500, అహ్మదాబాదులో రూ.56,550, కోయంబత్తూరులో రూ.56,920గా ఉన్నాయి.
ఇక తెలుగు రాష్టాల విషయానికి వస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర తెలంగాణలోని హైదరాబాదు, ఖమ్మం, వరంగల్, నిజాంబాద్ లలో రూ.61,640గా ఉంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,500 గా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖ, అనంతపూర్, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, అమరావతి, గుంటూరు నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,640గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.56,500గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications