Gold Price Today: అక్షయతృతీయకు ముందు వరుసగా రెండో రోజు సైతం దేశీయంగా పసిడి ధరలు క్షీణతను నమోదు చేశాయి. ఫెడ్ ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదని అవసరమైతే రేట్లు పెంచే యోచనలో ఉన్నట్లు వచ్చిన వార్తలతో పసిడి పరుగులకు ఒక్కసారిగా బ్రేక్ పడింది.
ఈ క్రమంలో 22 క్యారెట్ల పసిడి ధరలు దేశంలో నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు స్వల్పంగా రూ.1000 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన 10 గ్రాముల పసిడి రిటైల్ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.66,150, ముంబైలో రూ.66,150, దిల్లీలో రూ.66,300, కలకత్తాలో రూ.66,150, బెంగళూరులో రూ.66,150, కేరళలో రూ.66,150, వడోదరలో రూ.66,200, జైపూరులో రూ.66,300, నాశిక్ లో రూ.66,180, అయోధ్యలో రూ.66,300, బళ్లారిలో రూ.66,150, గురుగ్రాములో రూ.66,300, నోయిడాలో రూ.66,300 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.1,100 క్షీణతను నమోదు చేసింది. అక్షయతృతీయకు షాపింగ్ చేసేవారు దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలు 10 గ్రాములకు తగ్గిన తర్వాత నేడు గమనిస్తే.. చెన్నైలో రూ.72,160, ముంబైలో రూ.72,160, దిల్లీలో రూ.72,310, కలకత్తాలో రూ.72,160, బెంగళూరులో రూ.72,160, కేరళలో రూ.72,160, వడోదరలో రూ.72,210, జైపూరులో రూ.72,310, నాశిక్ లో రూ.72,190, అయోధ్యలో రూ.72,310, బళ్లారిలో రూ.72,160, గురుగ్రాములో రూ.72,310, నోయిడాలో రూ.72,310గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.66,150గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,160 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.200 పెరిగి రూ.88,700 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications