Gold Rate: శుభవార్త.. పండగ తర్వాత కుప్పకూలిన గోల్డ్ రేటు.. నేటి ఏపీ, తెలంగాణ రేట్లివే..
Gold Price Today: గతవారం తగ్గినట్లే తగ్గి గోల్డ్ రేట్లు తిరిగి భారీగా పుంజుకున్నాయి. దసరా పండుగకు షాపింగ్ చేద్దామని ప్లాన్ చేసిన చాలా మందికి పసిడి ధరల పెరుగుదల షాక్ ఇచ్చింది. అయితే పండుగ హడావిడి ముగిసిన తర్వాత సోమవారం గోల్డ్ రేట్లు కొనుగోలుదారులకు ఊరటను కలిగించాయి. ఈ క్రమంలో నెలాఖరున వస్తున్న దీపావళికి గోల్డ్, సిల్వర్ కొనాలనుకుంటున్న చాలా మంది ప్రస్తుతం హడావిడిలో ఉన్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.500 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన గోల్డ్ రేట్లను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7115, ముంబైలో రూ.7115, దిల్లీలో రూ.7130, దిల్లీలో రూ.7130, కలకత్తాలో రూ.7115, బెంగళూరులో రూ.7115, కేరళలో రూ.7115, వడోదరలో రూ.7120, అహ్మదాబాదులో రూ.7120, జైపూరులో రూ.7130, లక్నోలో రూ.7130, మంగళూరులో రూ.7115, నాశిక్ లో రూ.7118, అయోధ్యలో రూ.7130, బళ్లారిలో రూ.7115, గురుగ్రాములో రూ.7130, నోయిడాలో రూ.7130 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.500 స్వల్ప తగ్గుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7762, ముంబైలో రూ.7762, దిల్లీలో రూ.7777, కలకత్తాలో రూ.7762, బెంగళూరులో రూ.7762, కేరళలో రూ.7762, వడోదరలో రూ.7767, అహ్మదాబాదులో రూ.7767, జైపూరులో రూ.7777, లక్నోలో రూ.7777, మంగళూరులో రూ.7762, నాశిక్ లో రూ.7765, అయోధ్యలో రూ.7777, బళ్లారిలో రూ.7762, గురుగ్రాములో రూ.7777, నోయిడాలో రూ.7777గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7115గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7762 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7115గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7762 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,03,000 వద్ద స్థిరంగా విక్రయాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు మరియు మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది.


Click it and Unblock the Notifications