Gold Price: ఇటీవలి కాలంలో బంగారం తన జీవితకాల గరిష్ఠాలను తాకిన తర్వాత కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తోంది. యూఎస్ బాండ్స్ రిటర్న్స్ పెరుగుతున్న తరుణంలో చాలా మంది తమ గోల్డ్ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల దాదాపు రూ.60వేల మార్క్ చేరువకు వెళ్లిన బంగారం ధర మళ్లీ తగ్గటం ప్రారంభమైంది.

నిపుణులు ఏమంటున్నారంటే..
మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం యూఎస్ డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్ తిరిగి రీబౌండ్ కావటం వల్ల బంగారం ధరల ర్యాలీకి బ్రేకులు పడ్డాయని వారు చెబుతున్నారు. అయితే వారి తాజా అంతనా ప్రకారం గోల్డ్ ఇన్వెస్టర్లు ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయటం ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు. అయితే గోల్డ్ ధరలు బులిష్ మెుమెంటంలో ఉన్నందున ప్రస్తుతం ఎలాంటి అమ్మకపు నిర్ణయాలు వద్దని వారు ట్రేడర్లకు సూచిస్తున్నారు.

బ్రోకరేజ్ ప్రకారం..
దీపావళి తర్వాత బంగారం ధరల్లో ర్యాలీ స్తంభించింది. దీనికి కారణం దేశంలో రిజర్వు బ్యాంక్ రెపో రేటును క్రమంగా పెంచుతూ రావటం వల్ల చాలా మంది తమ డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేశారు. అయితే వడ్డీ రేట్ల పెంపు కారణంగా ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందనే భయాల నేపథ్యంలో గోల్డ్ ధరల పెరుగుదలకు మద్దతునిస్తోంది.
స్వల్పకాలిక US ట్రెజరీ రాబడులు దీర్ఘకాలిక దిగుబడుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదాన్ని సూచిస్తోందని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్‌లోని సీనియర్ కమోడిటీ రీసెర్చ్ అనలిస్ట్ నిర్పేంద్ర యాదవ్ వెల్లడించారు.

సెంట్రల్ బ్యాంకులు..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని గతంలో ఎన్నడూ లేని స్థాయిలో కొనుగోలు చేస్తున్నాయి. ఈ క్రమంలో యూరోపియన్ బ్యాంకులు బంగారం విక్రయాన్ని మానేశాయి. టర్కీ, ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల సెంట్రల్ బ్యాంకులు మాత్రం బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి.
ఆర్థిక అస్థిరతలు పెరుగుతున్న తరుణంలో తమ దేశాల ఆర్థిక పరిస్థితులను స్థిరీకంరించుకునేందుకు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈరోజు బంగారం ధరలు..(10 గ్రాములకు)
నేడు వివిధ నగరాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,160 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,400గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,250 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,400గా ఉంది. ఇక ముంబై నగరంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,380 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,600గా ఉంది.

ఆంధ్రప్రదేశ్ నగరాల్లో..
ఏపీలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేస్తే.. ముందుగా విజయవాడ నగరంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,380 ఉండగా.. 22 క్యారెట్ల్ బంగారం ధర రూ.52,600గా ఉంది. ఇక విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,380 ఉండగా 22 క్యారెట్ల ధర రూ.52,600గా ఉంది. ఇక నెల్లూరులోనూ ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే.. మార్చి 12, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. JP మోర్గాన్, గోల్డ్మన్ సాచ్స్ అంచనాలు చూస్తే వణుకు పుట్టడం ఖాయం..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold price: బంగారం, వెండి ధరల్లో మార్పు.. కారణాలివే..

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..



Click it and Unblock the Notifications