Gold Rate: పసిడి ప్రియులకు జాక్ పాట్.. రెండో రోజు రూ.2200 తగ్గిన గోల్డ్ రేటు, తాజా రేట్లివే..
Gold Price Today: దేశీయంగా ఈవారం బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గతవారం తగ్గినట్టే తగ్గి తిరిగి భారీగా పుంజుకున్న గోల్డ్ రిటైల్ విక్రయ ధరలతో పండక్కి చాలా మంది తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దీపావళికి ఆభరణాలు షాపింగ్ చేయాలనుకుంటున్న వారు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. మళ్లీ రేట్లు పెరగటానికి ముందే నచ్చిన వస్తువులు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే నేడు 100 గ్రాములకు ఏకంగా రూ.2000 తగ్గింపును నమోదు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నేడు తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7095, ముంబైలో రూ.7095, దిల్లీలో రూ.7110, కలకత్తాలో రూ.7095, బెంగళూరులో రూ.7095, కేరళలో రూ.7095, వడోదరలో రూ.7100, జైపూరులో రూ.7110, లక్నోలో రూ.7110, మధురైలో రూ.7095, మంగళూరులో రూ.7095, నాశిక్ లో రూ.7117, అయోధ్యలో రూ.7110, బళ్లారిలో రూ.7095, గురుగ్రాములో రూ.7110, నోయిడాలో రూ.7110 వద్ద నేడు విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.2200 పెరుగుదలను చూసింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో తగ్గిన నేటి రిటైల్ గోల్డ్ ధరలను పరిగణిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7740, ముంబైలో రూ.7740, దిల్లీలో రూ.7755, కలకత్తాలో రూ.7740, బెంగళూరులో రూ.7740, కేరళలో రూ.7740, వడోదరలో రూ.7745, జైపూరులో రూ.7755, లక్నోలో రూ.7755, మధురైలో రూ.7740, మంగళూరులో రూ.7740, నాశిక్ లో రూ.7743, అయోధ్యలో రూ.7755, బళ్లారిలో రూ.7740, గురుగ్రాములో రూ.7755, నోయిడాలో రూ.7755గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7095గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7740 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7095గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7740 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.100 తగ్గి నేడు రూ.1,03,000 వద్ద స్థిరంగా విక్రయాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు మరియు మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది.


Click it and Unblock the Notifications