Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త.. బొక్కబోర్లా పడిన గోల్డ్ రేట్లు.. భారీ తగ్గింపు ధరలు..
Gold Rate Today: వరుసగా మూడో రోజు సైతం పసిడి ధరలు దేశంలో కుప్పకూలాయి. గతంలో ఎన్నడూ చూడని వేగంతో ధరలు క్షీణిస్తున్నాయి. వారాంతంలో షాపింగ్ చేయాలనుకునే వారు తప్పకుండా ఇవాళ్టి రేట్లను పరిశీలించండి.
యూఎస్ బాండ్ ఈల్డ్స్ భారీగా పెరిగిన వేళ బంగారంలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో పసిడి ధరలు కళ తప్పాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు దేశంలోని ప్రధాన నగరాల్లో గమనిస్తే.. చెన్నైలో రూ.53,900, ముంబైలో రూ.53,650, దిల్లీలో రూ.53,800, కలకత్తాలో రూ.53,650, బెంగళూరులో రూ.53,650, కేరళలో రూ.53,650, వడోదరలో రూ.53,700, జైపూర్ లో రూ.53,800, లక్నోలో రూ.53,800, కోయంబత్తూరులో రూ.53,900, నాశిక్ లో రూ.53,920, గురుగ్రామ్ లో రూ.53,800 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.270 ధర తగ్గింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.58,800, ముంబైలో రూ.58,550, దిల్లీలో రూ.58,680, కలకత్తాలో రూ.58,530, బెంగళూరులో రూ.58,530, కేరళలో రూ.58,530, వడోదరలో రూ.58,580, జైపూర్ లో రూ.58,680, లక్నోలో రూ.58,680, కోయంబత్తూరులో రూ.58,800, నాశిక్ లో రూ.58,560, గురుగ్రామ్ లో రూ.58,680గా ఉన్నాయి.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ తగ్గిన రిటైల్ గోల్డ్ రేట్లు.. విజయవాడ, విశాఖ, అనంతపురం, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, కాకినాడ, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజాంబాద్ లలో 22 క్యారెట్లకు రూ.53,650 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.58,530 వద్ద విక్రయించబడుతోంది. అయితే వెండి ధర మాత్రం కిలోకు నేడు రూ.1000 పెరగటంతో ఏపీ, తెలంగాణలో రూ.77,500గా విక్రయించబడుతోంది.


Click it and Unblock the Notifications