Gold & Silver Rates: ఈరోజు కూడా తగ్గిన బంగారం ధర.. 1KG వెండి @ రూ.90,000..!

Gold & Silver Rates: దేశంలో అక్షయ తృతీయ తర్వాత బంగారం ధరలతో వెండి పోటీకి సిద్ధమైంది. ఇన్వెస్టర్లు తమ పోర్ట్ ఫోలియోలో వెండిని చేర్చుకుంటే మంచి లాభాలను గడించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అక్షయ తృతీయ తర్వాత బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు నిన్నటి కంటే రూ.70 తగ్గాయి. ఇదే క్రమంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర స్వల్పంగా రూ.80 మేర తగ్గింది. ఈ క్రమంలో వెండి ధర కిలోకు రూ.500 మేర తగ్గి కిలో వెండి ధర రూ.76,400గా మార్కెట్లో విక్రయించబడుతోంది. పరిశ్రమల నుంచి వెండికి డిమాండ్ పెరుగుతున్న తరుణంలో రానున్న కాలంలో కిలో వెండి ధర రూ.90,000లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Gold rates falling after akshaya trutiya, soon kg silver to reach 90000 rupees as industrial demand rose

వివిధ నగరాల్లో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం 10 గ్రాముల ధర చెన్నైలో రూ.61,250, ముంబైలో రూ.60,710, దిల్లీలో రూ.60,860, కోల్‌కతాలో రూ.60,710, బెంగళూరులో రూ.60,760, కేరళలో రూ.60,710, అహ్మదాబాదులో రూ.60,760, జైపూర్ లో రూ.60,860, మధురైలో రూ.61,250గా ఉన్నాయి. ఇక హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, విశాఖల్లో రూ.60,710 వద్ద కొనసాగుతున్నాయి.

ఇక దేశంలోని నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.56,150, ముంబైలో రూ.55,650, దిల్లీలో రూ.55,750, కోల్‌కతాలో రూ.55,650, బెంగళూరులో రూ.55,700, కేరళలో రూ.55,650, అహ్మదాబాదులో రూ.55,700, జైపూర్ లో రూ.55,750, మధురైలో రూ.56,150గా ఉన్నాయి. ఇక హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, విశాఖల్లో రూ.55,650గా విక్రయించబడుతున్నాయి.

ఒకపక్క బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. దీనిని ఆసరాగా తీసుకుని స్మగ్లర్లు సైతం చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో 2022-23 మొదటి 11 నెలల్లో దాదాపు 4,000 కిలోల స్మగ్ల్డ్ బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఇది నాలుగేళ్లలో అత్యధికం. స్మగ్లర్లకు సహకరిస్తున్నందున చెన్నై విమానాశ్రయంలో సిబ్బందిపై భారీగా కేసులు నమోదయ్యాయి.

9 కిలోల స్మగ్లింగ్ బంగారానికి సంబంధించిన ఏడు వేర్వేరు కేసులకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు. ఐదు కేసుల్లో సుమారు 32 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు సహకరించిన ఎనిమిది మంది క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్‌లను ముంబై విమానాశ్రయంలో అధికారులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+