Gold Rates: చాలా కాలంగా పైపైకి పెరుగుతూ పోతున్న బంగారం ధరలు ఒక్కసారిగా సామాన్యుల్లో చిరునవ్వులు చిందిస్తున్నాయి. పసిడి ధరలు క్రమంగా తగ్గుతూ కొనుక్కోవాలనుకునే వారికి మంచి అవకాశాన్ని తీసుకొచ్చాయి.
ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరను పరిశీలిస్తే దాదాపు రూ.700 తగ్గింది. అంటే కిలోపై బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.70,000 తగ్గింది. ఈ క్రమంలో వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,800, ముంబైలో రూ.55,300, దిల్లీలో రూ.55,450, కలకత్తాలో రూ.55,300, బెంగళూరులో రూ.55,350, కేరళలో రూ.55,300, పూణేలో రూ.55,300, జైపూర్ లో రూ.55,450, మంగళూరులో రూ.55,350, గురుగ్రామ్ లో రూ.55,450గా ఉన్నాయి.

ఇదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.770 తగ్గింది. దీంతో వివిధ నగరాల్లో తాజా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,870, ముంబైలో రూ.60,330, దిల్లీలో రూ.60,480, కలకత్తాలో రూ.60,330, బెంగళూరులో రూ.60,380, కేరళలో రూ.60,330, పూణేలో రూ.60,330, జైపూర్ లో రూ.60,480, మంగళూరులో రూ.60,380, గురుగ్రామ్ లో రూ.60,480గా ఉన్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే.. తెలంగాణలోని హైదరాబాదు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లలో రూ.55,300గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,330 వద్ద ఉన్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర విజయవాడ, విశాఖ, అమరావతి, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, కాకినాడల్లో రూ.రూ.55,300గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,330కు 10 గ్రాములు అమ్ముడుపోతోంది.
ఈరోజు వెండి ధరలను పరిశీలిస్తే స్వల్పంగా తగ్గాయని చెప్పుకోవచ్చు. నిన్న రూ.73,400గా ఉన్న కిలో వెండి ధర నేడు రూ.73,000కు చేరుకుంది. అంటే కిలోకు వెండి ధర ఏకంగా రూ.400 తగ్గింది.


Click it and Unblock the Notifications