Year Ender 2023: ఈ ఏడాది పెరిగిన బంగారం ధర.. అసలు 5 కారణాలు ఇవే..!!
Gold News: ఏడాది పొడవునా బంగారం తన ధర ఆధిపత్యాన్ని కొనసాగించినప్పటికీ స్టాక్ మార్కెట్ల కంటే ఎక్కువ రాబడిని అందించటంలో వెనకబడింది. క్రిస్మస్‌కు ముందు మార్కెట్లు భారీ ర్యాలీ కారణంగా కీలక బెంచ్ మార్క్ సూచీలు కొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరుకున్నాయి.
కమోడిటీ మార్కెట్ నిపుణుల ప్రకారం అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం, భౌగోళిక-రాజకీయ సంక్షోభం, US ఫెడ్ రేట్ పాజ్ వంటి కొన్ని కారణాలు ఏడాది పొడవునా గోల్డ్ పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఉండేందుకు సహాయ పడిందని తెలుస్తోంది. దీనికి తోడు ఇటీవల యూఎస్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను వచ్చే ఏడాది మూడు సార్లు తగ్గించొచ్చని సంకేతాలు ఇవ్వటంతో మళ్లీ పసిడి రేట్లలో ర్యాలీ మెుదలైంది.

ప్రస్తుతం బంగారం వర్సెస్ స్టాక్ మార్కెట్లుగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మెరుగైన రాబడుల వైపు మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో నిఫ్టీ సూచీ వార్షిక ప్రాతిపధికన 18 శాతం రాబడిని అందించగా.. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర గరిష్ఠంగా 2,148 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 800 మెట్రిక్ టన్నుల బంగారం సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు చేయడం కూడా ఒక ముఖ్యమైన అంశం. 2023లో బంగారం పెట్టుబడిదారులకు భారీ రాబడిని అందించడంలో సహాయపడిన 5 అంశాలను పరిశీలిస్తే..
1] సేఫ్ హెవెన్: ఈ సంవత్సరం US బ్యాంకింగ్ సంక్షోభంతో ప్రారంభమైంది. రిస్క్ తీసుకోవాలనుకోని పెట్టుబడిదారులు తమ సంపదను సేఫ్ హెవెన్ బంగారం వైపు మళ్లించటంతో ధరలు పెరిగాయి.
2] భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు: రెండవ, మూడవ త్రైమాసికంలో ధరలు చల్లబడినప్పటికీ, Q4లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య చెలరేగిన వివాదంతో విలువ నిల్వగా బంగారానికి డిమాండ్ మళ్లీ పుంజుకుంది.
3] డోవిష్ ఫెడ్- డాలర్ ధర: 2024లో సంభావ్య రేటు తగ్గింపుల వైపు నడవాలనుకోవటం ఫెడ్ డాలర్‌ను బలహీనపరిచింది. ఇది బంగారంపై కొనుగోలుదారుల ఆకర్షణను పెంచింది.
4] సెంట్రల్ బ్యాంక్స్: సెంట్రల్ బ్యాంక్‌ల ద్వారా పెద్ద మొత్తంలో వ్యూహాత్మక బంగారం కొనుగోళ్లు పెరగటం కూడా బంగారానికి పరోక్షంగా డిమాండ్ పెరిగేందుకు కారణమైంది. అది ధరల పెరుగుదలను కలిగించింది.
5] బలమైన పండుగ డిమాండ్: Q4లో భారతీయ పండుగల సీజన్‌లో బలమైన బంగారం కొనుగోళ్లు జరిగాయి. ఆభరణాలకు డిమాండ్ పెరగటం కూడా రేట్లను ప్రభావితం చేశాయి.


Click it and Unblock the Notifications