బంగారం ధరలు లక్ష రూపాయల మార్కును తాకాయి. సామాన్యులు బంగారం కొనాలంటేనే హడలిపోతున్నారు. పసిడి ధరలు తగ్గితే చాలా బాగుండని అనుకుంటున్నారు. మరి పసిడి ధరలు భవిష్యత్తులో తగే అవకాశాలు ఉన్నాయా.. ఏ పరిస్థితులు జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి అనే దానిపై ఆర్థిక నిపుణులు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ అంశాలు కనుక ప్రపంచ మార్కెట్లో జరిగితే బంగారం ధరలు దాదాపు రూ. 30 వేల వరకు తగ్గుతాయని చెబుతున్నారు.ఇంతకీ ఆ అంశాలు ఏంటో ఓ సారి చూద్దాం.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండి ఇన్వెస్టర్లు బంగారాన్ని వదిలి అధిక రిస్క్ కలిగిన ఆస్తులపై దృష్టి సారిస్తే పసిడి ధరలు తగ్గుతాయి. స్టాక్ మార్కెట్లు పుంజుకున్న కాలంలో లేదా ఆర్థిక లోటు లేని సమయంలో పెట్టుబడిదారులు పసిడి మీద మోజు చూపరు. తద్వారా ధరలు తగ్గుతాయి. ఇక మరో అంశం ఏంటంటే.. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరిగితే ఇతర కరెన్సీలు కలిగిన పెట్టుబడిదారులకు బంగారం ఖరీదైన వస్తువుగా మారుతుంది. బంగారాన్ని డాలర్ లలో కొనడానికి ఇష్టపడరు తద్వారా కూడా Gold Rates తగ్గుతాయి.

ఆర్ బీఐ వడ్డీ రేట్లు మార్పులు చేసే సమయంలో కూడా బంగారం ధరలు తగ్గుతాయి. అధిక రాబడి కోసం పెట్టుబడిదారులు బంగారాన్ని వదిలేసి బ్యాంక్ డిపాజిట్లు, బాండ్లు వంటి వాటిల్లో తమ పెట్టుబడులను పెడతారు.బంగారాన్ని విక్రయించి వడ్డీ ఇచ్చే ఆస్తులను కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ప్రయత్నిస్తారు.దీంతో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. కేంద్ర బ్యాంకులు సంక్షోభ సమయంలో పెద్ద మొత్తంలో బంగారాన్ని మార్కెట్లో అమ్మడం వల్ల కూడా బంగారానికి డిమాండ్ తగ్గి ధరలు తగ్గే అవకాశం ఉంది.
బంగారానికి డిమాండ్ రావడానికి భారత్, చైనాలే ప్రధాన కారణం. ఈ రెండు దేశాల్లోని ప్రజలు ప్రతీ శుభకార్యానికి బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ కొనుగోళ్లు తగ్గితే బంగారం ధరలు కూడా తగ్గుతాయి. ఇక మరో అంశం ఏంటంటే.. ఇండియా బంగారం మీద దిగుమతి సుంకాలు తగ్గిస్తే దేశీయ మార్కెట్లో ధరలు ధరలు తగ్గుతాయి. సామాన్యులకు తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు బంగారం మీద పెట్టుబడులు తగ్గే విధంగా ఆర్థిక విధానాలను అమలు చేసినా కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications