Gold Rate: శుభవార్త.. నేడు పసిడి ధరల పతనం.. వారాంతపు షాపింగ్ మెుదలెట్టండి..
Gold Price Today: నిన్న భారీ పెరుగుదల తర్వాత నేడు పసిడి ధరలు వెనకడుగు తీసుకున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లలో నేడు గోల్డ్ రేట్ల పతనం కొనసాగటంతో చాలా మంది వారాంతపు షాపింగ్ కోసం సిద్ధం అవుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే రూ.1000 తగ్గుదలను చూసింది. దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీసిస్తే.. చెన్నైలో రూ.6705, ముంబైలో రూ.6705, దిల్లీలో రూ. 6720, కలకత్తాలో రూ.6705, బెంగళూరులో రూ.6705, కేరళలో రూ.6705, వడోదరలో రూ.6710, జైపూరులో రూ.6720, మంగళూరులో రూ.6705, నాశిక్ లో రూ.6708, అయోధ్యలో రూ.6720, బళ్లారిలో రూ.6705, గురుగ్రాములో రూ.6720, నోయిడాలో రూ.6720 వద్ద నేడు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్లో గోల్డ్ ధర నిన్నటి కంటే రూ.1000 తగ్గుదలను నమోదు చేసింది. ఇదే క్రమంలో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.7315, ముంబైలో రూ.7315, దిల్లీలో రూ.7330, కలకత్తాలో రూ.7315, బెంగళూరులో రూ.7315, కేరళలో రూ.7315, వడోదరలో రూ.7320, జైపూరులో రూ.7330, మంగళూరులో రూ.7315, నాశిక్ లో రూ.7318, అయోధ్యలో రూ.7330, బళ్లారిలో రూ.7315, గురుగ్రాములో రూ.7330, నోయిడాలో రూ.7330గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6705గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7315 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.91,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications