Gold Price Today: భారతీయ పసిడి ప్రియులు 2025 నుంచి నిరంతరం పెరుగుతున్న గోల్డ్ ధరలతో పరేషాన్ అవుతున్నారు. మరికొన్ని రోజులు ఆగితే ధరలు తిరిగి తగ్గుతాయా అనే సందిర్ధంలో ఉన్నారు. అయితే వీరికి ఊరటను అందించే వార్త ఇప్పుడు తెలుసుకోవాల్సిందే.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధంలో భాగంగా తీసుకోనున్న పాలసీలపై క్లారిటీ రాకపోవటంతో మల్టీ కమోడిటీస్ ఎక్స్ఛేంజీలో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపారు. దీంతో నేటి ఉదయం ట్రేడింగ్ సెషన్లో బంగారం ధరలు పతనాన్ని చూశాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 5న ముగిసే ఫ్యూచర్ల రేటు 10 గ్రాములకు రూ.79,456 వద్ద ఉదయం ట్రేడింగ్ కొనసాగిస్తోంది. వస్తవానికి ఇది గత సెషన్లో 10 గ్రాములకు రూ.79,564 వద్ద ఉన్న సంగతి తెలిసిందే.

గోల్డ్ పెట్టుబడిదారులు ముందుగా యూఎస్ కొత్త అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు ఏ దిశగా సాగుతాయనే అంశంపై క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త పెట్టుబడులకు బదులు లాభాల స్వీకరణ చేపట్టి వేచి చూసే ధోరణిని వారు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. రాయిటర్స్ సంస్థ తాజా నివేధిక ప్రకారం ట్రంప్ చైనా దిగుమతులపై 10 శాతం టారిఫ్ విధించాలని చూస్తున్నట్లు వెల్లడైంది. ఇదే క్రమంలో ఆయన యూరోపియన్ దేశాల నుంచి వస్తువులపై కూడా టారిఫ్స్ ఉంటాయని ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే.
పసిడి ఇన్వెస్టర్లు ప్రస్తుతం మరో వారం రోజుల్లో రాబోతున్న యూనియన్ బడ్జెట్ 2025తో పాటు వచ్చేవారం యూఎస్ ఫెడరల్ పాలసీ మీటింగ్ ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం దిగుమతులపై సుంకాలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటిపై క్లారిటీ కోసం మరికొంత సమయం వేచిచూడాల్సిందేనని ఇన్వెస్టర్లు భావిచటం కూడా గోల్డ్ ధరల పతనానికి కారణంగా మారింది.
ప్రస్తుతం ఎంసీఎక్స్ లో పసిడి 10 గ్రాములకు సపోర్ట్ రూ.79300-79080గా ఉంది. ఇదే క్రమంలో వెండి సపోర్ట్ ధరలు రూ.91220-90700గా ఉన్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ వెల్లడించారు. నేడు మార్కెట్లో రేట్ల పతనం రేపటి రిటైల్ రేట్లలో ప్రతిధ్వనించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాదులో గోల్డ్-సిల్వర్ ధరలు..
తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7525గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8209 వద్ద కొనసాగుతోంది. ఇదే క్రమంలో తెలంగాణలో నేటి రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే కేజీకి రేటు రూ.1,04,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. వాస్తవానికి పైన పేర్కొన్న రేట్లకు జీఎస్టీ, తయారీ మజూరి, తరుగు వంటి అదనపు ఖర్చులు ఉంటాయని వినియోగదారులు గమనించాలి.


Click it and Unblock the Notifications