Gold Rate: శుభవార్త.. రెండో రోజూ కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.3,300 తగ్గిన గోల్డ్ రేటు..
Gold Price Today: ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురొచ్చింది అన్నట్లుగా పసిడి ధరలు భారీగా తగ్గటంపై భారతీయ కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా రెండో రోజు ధరలు అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా తగ్గటంతో రేట్లు మరింతగా తగ్గవచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫెడ్ రేట్ల తగ్గింపు తర్వాత అమాంతం పెరిగిన గోల్డ్ ధరలు ప్రస్తుతం ప్రజలకు అనుకూలంగా దిగివస్తున్నాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.3000 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన నేటి రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7050, ముంబైలో రూ.7050, దిల్లీలో రూ.7065, కలకత్తాలో రూ.7050, బెంగళూరులో రూ.7050, కేరళలో రూ.7050, వడోదరలో రూ.7055, జైపూరులో రూ.7065, మంగళూరులో రూ.7050, నాశిక్ లో రూ.7053, అయోధ్యలో రూ.7065, బళ్లారిలో రూ.7050, గురుగ్రాములో రూ.7065, నోయిడాలో రూ.7065 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

24 క్యారెట్లో గోల్డ్ విక్రయ ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.3300 తగ్గింపును చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7691, ముంబైలో రూ.7691, దిల్లీలో రూ.7706, కలకత్తాలో రూ.7691, బెంగళూరులో రూ.7691, కేరళలో రూ.7691, వడోదరలో రూ.7696, జైపూరులో రూ.7706, మంగళూరులో రూ.7691, నాశిక్ లో రూ.7694, అయోధ్యలో రూ.7706, బళ్లారిలో రూ.7691, గురుగ్రాములో రూ.7706, నోయిడాలో రూ.7706గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7050గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7691 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఆర్థిక ఆరోగ్యం, స్థిరత్వాన్ని కొనసాగించే క్రమంలో.. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల పసిడి కొనుగోళ్లు ధరల పెరుగుదల చూసిన తర్వాత తిరిగి క్రమంగా తగ్గుదలను చూస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పసిడి డిమాండ్ పెరగడం, ముఖ్యంగా ఆర్థిక అస్థిరతలు లేదా మునుపటి కంటే ఎక్కువ రిస్క్ ఉన్న సమయంలో ధరలను ప్రభావితం చేస్తుంది. కేంద్ర బ్యాంకులు తమ ఆర్థిక విధానాలను సానుకూలంగా మార్చినప్పుడు, గోల్డ్ హోల్డింగ్స్ ఎక్కువగా ఉండటాన్ని భద్రతగా భావించి, భారీగా కొత్త నిల్వలు పెంచుతుంటాయి. అయితే మెగా ర్యాలీ తర్వాత గోల్డ్ రేట్లు కొత్త నెల మెుదటి రోజున తగ్గింపులను కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications