Gold Rate: శుభవార్త.. మూడోరోజూ గిర్రున తిరిగి కిందపడ్డ గోల్డ్ రేటు..! హ్యాపీ షాపింగ్..
Gold Price Today: దీపావళి తర్వాత వరుసగా బంగారం ధరలు తమ గరిష్ఠాల నుంచి తిరిగి కిందకు వస్తున్నాయి. దీంతో నాగుల చవితి పండుగ రోజున గోల్డ్ షాపింగ్ చేయాలనుకుంటున్న చాలా మంది షాపులకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో నేడు తగ్గిన ధరలను రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిశీలించి కొనుగోలు చేయటం ఉత్తమం..
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1500 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7355, ముంబైలో రూ.7355, దిల్లీలో రూ.7370, కలకత్తాలో రూ.7355, బెంగళూరులో రూ.7355, కేరళలో రూ.7355, వడోదరలో రూ.7360, అహ్మదాబాదులో రూ.7360, జైపూరులో రూ.7370, పాట్నాలో రూ.7360, మంగళూరులో రూ.7355, నాశిక్ లో రూ.7358, అయోధ్యలో రూ.7370, బళ్లారిలో రూ.7355, గురుగ్రాములో రూ.7370, నోయిడాలో రూ.7370 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.1600 నేడు తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8024, ముంబైలో రూ.8024, దిల్లీలో రూ.8039, కలకత్తాలో రూ.8024, బెంగళూరులో రూ.8024, కేరళలో రూ.8024, వడోదరలో రూ.8029, అహ్మదాబాదులో రూ.8029, జైపూరులో రూ.8039, పాట్నాలో రూ.8029, మంగళూరులో రూ.8024, నాశిక్ లో రూ.8027, అయోధ్యలో రూ.8039, బళ్లారిలో రూ.8024, గురుగ్రాములో రూ.8039, నోయిడాలో రూ.8039గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7355గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8024 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7355గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8024 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.1000 తగ్గి నేడు రూ.1,05,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మెల్లగా వృద్ధి బాట పడుతున్న వేళ పసిడి ఇన్వెస్టర్లు తమ డబ్బును తిరిగి స్టాక్, బాండ్ మార్కెట్లలోకి తిరిగి మళ్లిస్తున్నారని తెలుస్తోంది. దీంతో గోల్డ్ డిమాండ్ నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. మరో పక్క రాజకీయ అనిశ్చితులో పాటు భౌగోళిక ఉద్రిక్తతలు నెమ్మదింటంతో గోల్డ్ ధరలు తగ్గుతూ ఊరటను అందిస్తున్నాయి. ఇదే క్రమంలో సెంట్రల్ బ్యాంకులు మాత్రం తమ కొనుగోళ్ల దూకుడును కొనసాగిస్తూనే ఉన్నాయని తెలుస్తోంది. దీపావళి తర్వాత వరుసగా రోజూ ధరలు నెమ్మదిగా చల్లారుతూ పెళ్లిళ్ల సీజన్ కోసం ఆభరణాలు కొనుగోలు చేయాటని చూస్తున్న వారికి ఊరట కలిగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications