Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. నేడు రూ.13,100 పెరిగిన గోల్డ్, హైదరాబాదులో తులం ఎంతంటే?
Gold Price Today: బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కేవలం ఒక్కరోజు ముందు పసిడి ప్రియులకు గుండెపోటు వచ్చే విధంగా గోల్డ్ రేట్లు భారీగా పెరిగిపోయాయి. వాస్తవానికి బడ్జెట్లో పసిడికి ఉపశమనాలు ఉంటా లేక దిగుమతులపై పన్నులు పెంచుతారా అనే ఆందోళనల్లో వ్యాపారులు, వినియోగదారులు ఉన్న క్రమంలో భారీగా రేట్ల పెరుగుదల అందరినీ షాక్ కి గురిచేస్తోంది. వరుస రేట్ల పెంపు సాధారణ కొనుగోలుదారుల ఆశలపై నీళ్లు జల్లుతోంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.12,000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరుగుతున్న రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7730, ముంబైలో రూ.7730, దిల్లీలో రూ.7745, కలకత్తాలో రూ.7730, కేరళలో రూ.7730, బెంగళూరులో రూ.7730, వడోదరలో రూ.7735, జైపూరులో రూ.7745, మంగళూరులో రూ.7730, నాశిక్ లో రూ.7733, అయోధ్యలో రూ.7745, బళ్లారిలో రూ.7730, గురుగ్రాములో రూ.7745, నోయిడాలో రూ.7745 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.13,100 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8433, ముంబైలో రూ.8433, దిల్లీలో రూ.8448, కలకత్తాలో రూ.8433, కేరళలో రూ.8433, బెంగళూరులో రూ.8433, వడోదరలో రూ.8438, జైపూరులో రూ.8448, మంగళూరులో రూ.8433, నాశిక్ లో రూ.8436, అయోధ్యలో రూ.8448, బళ్లారిలో రూ.8433, గురుగ్రాములో రూ.8448, నోయిడాలో రూ.8448గా ఉన్నాయి. అయితే ఈ ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి, వ్యాపారి లాభాలు వంటివి కలపకముందువిగా గుర్తుంచుకోవాలి.
బడ్జెట్ భయాలు..
వాస్తవానికి గత బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం దిగుమతులపై సుంకాన్ని భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వినియోగం భారీగా పెరగటంతో దిగుమతులు పెరిగాయనే వాదన వినిపిస్తోంది. అయితే దీనిని అదుపుచేసేందుకు ఈసారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పసిడి దిగుమతులపై భారీగా పన్నులను పెంచవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది దిగుమతులు పెరుగుదలతో ట్రేడ్ డెఫిసిట్ పెంచుతోందని నిపుణులు వాదిస్తున్నారు. ప్రస్తుతం డాలర్ ధర బలంగా ఉండటంతో పాటు రూపాయి మారకపు విలువ పడిపోవటం ఆర్థిక లోటును మరింతగా పెంచుతోందని నిపుణులు చెప్పటం భయాలకు కారణంగా తెలుస్తోంది.
హైదరాబాదులో గోల్డ్ రేట్లు..
ఇదే క్రమంలో తెలంగాణలోని.. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7730గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8433 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.1000 పెరగటంతో నేడు రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications