Gold Rate: పండగరోజు పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. ఒక్కరోజే 4 వేలు తగ్గిన గోల్డ్ రేటు.. గెట్ రెడీ టు షాపింగ్
Gold Price Today: వారం మొత్తం స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు ఇవాళ స్వల్ప తగ్గుదలతో ఊరటను కలిగించాయి. పండుగలను పురస్కరించుకుని వినాయక చవితి సందర్భంగా ఆభరణాల షాపింగ్ చేస్తున్న వారికి నేడు తగ్గిన గోల్డ్ రేటు కొంత సాంత్వన ఇస్తుందని చెప్పవచ్చు.
22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.4000 తగ్గుదల చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన పసిడి ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.6680, ముంబైలో రూ.6680, దిల్లీలో రూ.6695, కలకత్తాలో రూ.6680, బెంగళూరులో రూ.6680, కేరళలో రూ.6680, వడోదరలో రూ.6685, జైపూరులో రూ.6695, మంగళూరులో రూ.6680, నాశిక్ లో రూ.6683, అయోధ్యలో రూ.6725, బళ్లారిలో రూ.6695, గురుగ్రాములో రూ.6695, నోయిడాలో రూ.6695గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 100 గ్రాములకు నిన్నటి కంటే ధర రూ.4,400 తగ్గుదల చూసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7287, ముంబైలో రూ.7287, దిల్లీలో రూ.7302, కలకత్తాలో రూ.7287, బెంగళూరులో రూ.7287, కేరళలో రూ.7287, వడోదరలో రూ.7292, జైపూరులో రూ.7302, మంగళూరులో రూ.7287, నాశిక్ లో రూ.7290, అయోధ్యలో రూ.7302, బళ్లారిలో రూ.7287, గురుగ్రాములో రూ.7302, నోయిడాలో రూ.7302గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6680గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7287 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.84,500 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications