ట్రంప్ ఒకే ఒక్క ప్రకటన..బంగారం ధరలను కుప్పకూల్చింది.. ఇంతకీ ఆ ప్రకటన ఏంటంటే..

దేశీయంగా బంగారం ధరల పరుగులుకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇటీవలే జీవితకాల గరిష్టాన్ని తాకిన పసిడి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చేసిన ఒకే ఒక్క ప్రకటనతో నేల చూపులు చూసింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌ (MCX)లో సోమవారం బంగారం ధర రూ.1400 కంటే ఎక్కువగానే పతనమైంది.

MCXలో 999 స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర సోమవారం ట్రంప్ ప్రకటన వెలువడగానే రూ.1,409 తగ్గి రూ.1,00,389 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో అది ఒక దశలో రూ.1,01,199 వరకు చేరింది. గత వారం మాత్రమే బంగారం 10 గ్రాములకు రూ.1,02,250 వరకు పెరిగి రికార్డు సృష్టించింది. అంటే, ప్రస్తుతం అది గరిష్ట స్థాయి కంటే రూ.1,861 తక్కువగా ఉంది. మంగళవారం ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రారంభమైనా, Gold ధరలు బలహీనంగానే మొదలయ్యాయి.

డొనాల్డ్ ట్రంప్‌ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేస్తూ.. బంగారంపై ఎటువంటి సుంకాలు విధించే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. వెంటనే అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సుకు 3,404.70 డాలర్ల వద్ద ముగిసింది.

Gold rate fall 24K gold price today 10 gram gold rate Trump no tariff impact gold price drop news gold price update MCX gold rate international gold market gold price after Trump statement gold market news bullion rate today gold price trend 24 karat gold rate India gold price latest update gold trading news 24 10 MCX 24

ఇక అమెరికా అధ్యక్షుడి ప్రకటన ప్రభావం వెంటనే భారత మార్కెట్‌లో కనిపించింది. ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్‌ ప్రకారం.. సోమవారం ఉదయం 24 క్యారెట్ Gold ధర 10 గ్రాములకు రూ.1,00,201గా ఉండగా, మార్కెట్ ముగిసే సమయానికి అది రూ.99,957కి పడిపోయింది. అంటే, ఒక్కరోజులో రూ.244 తగ్గుదల నమోదు చేసింది.

22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.97,560కి పడిపోయింది. 20 క్యారెట్ బంగారం ధర రూ.88,960గా ఉంది. దేశవ్యాప్తంగా IBJA ధరలు ఒకే విధంగా ఉంటాయి కానీ, వినియోగదారులు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో 3 శాతం GSTతో పాటు తయారీ ఛార్జీలు కూడా చెల్లించాలి. ఈ ఛార్జీలు రాష్ట్రం, నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

బంగారం మాత్రమే కాదు.. వెండి కూడా ధరల్లో క్షీణతను నమోదు చేసింది. MCXలో వెండి ఫ్యూచర్స్ ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, ట్రంప్ వ్యాఖ్యలతో సేఫ్ హేవెన్ డిమాండ్ తగ్గడం ప్రధాన కారణాలుగా ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. బులియన్ విశ్లేషకుల ప్రకారం.. బంగారం ధరలు తాత్కాలికంగా బలహీనత చూపినా, జియోపాలిటికల్ అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల వలన మధ్యకాలంలో ధరలు మళ్లీ పైకే వెళ్లే అవకాశముంది. కాబట్టి, పెట్టుబడిదారులు తక్షణ లాభాల కంటే దీర్ఘకాల వ్యూహాన్ని అనుసరించాలని సూచిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+