Gold Price Today: వారం చివరి రోజుల్లో వరుసగా బంగరం ధరల్లో పతనం కొనసాగుతోంది. 10 గ్రాములకు దాదాపు 500 వరకు రేటు తగ్గటం భారతీయ కొనుగోలుదారులను ఆనందానికి గురిచేసింది. చాలా మంది నేడు షాపింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.100 క్షీణతను నమోదు చేసిందే. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.61,850, ముంబైలో రూ.61,250, దిల్లీలో రూ.61,400, కలకత్తాలో రూ.61,250, కేరళలో రూ.61,250, వడోదరలో రూ.61,300, జైపూరులో రూ.61,400, లక్నోలో రూ.61,400, మంగళూరులో రూ.61,250, నాశిక్ లో రూ.61,280, మైసూరులో రూ.61,250, బళ్లారిలో రూ.61,250, గురుగ్రాములో రూ.61,400, నోయిడాలో రూ.61,400గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల బంగారం ధరలు నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.110 క్షీణతకు గురైంది. దేశంలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ తగ్గిన ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.67,470, ముంబైలో రూ.66,820, దిల్లీలో రూ.66,970, కలకత్తాలో రూ.66,820, కేరళలో రూ.66,820, వడోదరలో రూ.66,870, జైపూరులో రూ.66,970, లక్నోలో రూ.66,970, మంగళూరులో రూ.66,820, నాశిక్ లో రూ.66,850, మైసూరులో రూ.66,820, బళ్లారిలో రూ.66,820, గురుగ్రాములో రూ.66,970, నోయిడాలో రూ.66,970గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.61,250గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.66,820 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.1,000 పెరిగి రూ.80,500 వద్ద కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications