Gold Rate: దిమ్మతిరిగే షాకిచ్చిన గోల్డ్.. నేడు రూ.7100 అప్, దేవుడా ఇన నువ్వే ఆపాలి..
Gold Price Today: ఈవారం మధ్యలో ఒక్కసారి తగ్గిన గోల్డ్ రేట్లు అందరికీ ఉపశమనాన్ని ఇచ్చాయి. మరింతగా ధరల పతనం ఉంటుందని భారతీయ పసిడి ప్రియులు అంచనా వేశారు. అయితే దీని తర్వాత నిన్నటి నుంచి విలువైన లోహాల ధరలు తిరిగి భారీగా పెరుగుదలను చూస్తున్నాయి. దీంతో మార్కెట్లో పెద్ద అలజడి మెుదలైంది. పైగా వారాంతం వచ్చేసరికి పెరిగిన రేట్లు కొనుగోలుదారులను దీపావళి, ధనత్రయోదశికి ముందు గందరగోళానికి గురిచేస్తున్నాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.6500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7360, ముంబైలో రూ.7360, దిల్లీలో రూ.7375, కలకత్తాలో రూ.7360, బెంగళూరులో రూ.7360, కేరళలో రూ.7360, వడోదరలో రూ.7300, అహ్మదాబాదులో రూ.7300, జైపూరులో రూ.7375, లక్నోలో రూ.7375, మంగళూరులో రూ.7360, నాశిక్ లో రూ.7263, మైసూరులో రూ.7360, అయోధ్యలో రూ.7375, బళ్లారిలో రూ.7360, గురుగ్రాములో రూ.7375, నోయిడాలో రూ.7375 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.7100 పెరుగుదలను చూసింది. దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8029, ముంబైలో రూ.8029, దిల్లీలో రూ.8044, కలకత్తాలో రూ.8029, బెంగళూరులో రూ.8029, కేరళలో రూ.8029, వడోదరలో రూ.7963, అహ్మదాబాదులో రూ.8034, జైపూరులో రూ.8044, లక్నోలో రూ.8044, మంగళూరులో రూ.8029, నాశిక్ లో రూ.8032, మైసూరులో రూ.8029, అయోధ్యలో రూ.8044, బళ్లారిలో రూ.8029, గురుగ్రాములో రూ.8044, నోయిడాలో రూ.8044గా ఉన్నాయి. అయితే ఇవి చట్టపరమైన పన్నులు, వ్యాపారి లాభాలు, తరుగు మజూరి వంటి ఖర్చులను జోడించక మునుపటి ధరలుగా గుర్తుంచుకోండి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7360గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8029 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7360గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8029 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు, మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది. పైగా పండుగ దగ్గరపడుతున్న కొద్ది రేట్లు కొత్త గరిష్ఠాలను తాకుతున్నాయి.


Click it and Unblock the Notifications