Gold Price Today: ఇన్నాళ్లుగా పెరుగుతున్న పసిడి ధరలు సామాన్యులకు ఆందోళనల కలిగించేవి. కానీ ఇప్పుడు బంగారం షాపు యజమానులతో పాటు ధనవంతులకు సైతం నిరంతరం పెరుగుతున్న పసిడి ధరలు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో పండుగకు ముందు షాపింగ్ చేయాలని చూస్తున్న భారతీయులకు రేట్లు ఆందోళన కలిగిస్తున్నాయి.
వాస్తవానికి ప్రస్తుతం భారతీయ పసిడి వ్యాపారం పెద్ద షాక్ కి గురవుతోంది. ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు ఆభరణాల కొనుగోలుకు రేట్ల పెరుగుదలతో దూరంగా వెళుతున్నారు. ఇదే క్రమంలో రోజురోజుకూ తగ్గుతున్న వ్యాపారం గోల్డ్ షాపు యజమానులను సైతం ఆందోళనలకు గురిచేస్తోంది. ఈ క్రమంలో చాలా మంది వ్యాపారులు తక్కువ లాభాల మార్జిన్ పెట్టుకుని వ్యాపారం చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. షాపులకు వస్తున్న కొనుగోలుదారుల సంఖ్య భారీగా క్షీణించిందని వారు చెబుతున్నారు.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.3000 భారీ పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గ్రాముకు పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7970, ముంబైలో రూ.7970, దిల్లీలో రూ.7985, కలకత్తాలో రూ.7970, బెంగళూరులో రూ.7970, హైదరాబాదులో రూ.7970, కేరళలో రూ.7970, వడోదరలో రూ.7975, అహ్మదాహబాదులో రూ.7975, జైపూరులో రూ.7985, లక్నోలో రూ.7985, మంగళూరులో రూ.7970, నాశిక్ లో రూ.7973, మైసూరులో రూ.7970, అయోధ్యలో రూ.7985, బళ్లారిలో రూ.7970, గురుగ్రాములో రూ.7985, నోయిడాలో రూ.7985 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.3,300 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8695, ముంబైలో రూ.8695, దిల్లీలో రూ.8710, కలకత్తాలో రూ.8695, బెంగళూరులో రూ.8695, హైదరాబాదులో రూ.8695, కేరళలో రూ.8695, వడోదరలో రూ.8700, అహ్మదాహబాదులో రూ.8700, జైపూరులో రూ.8710, లక్నోలో రూ.8710, మంగళూరులో రూ.8695, నాశిక్ లో రూ.8698, మైసూరులో రూ.8695, అయోధ్యలో రూ.8710, బళ్లారిలో రూ.8695, గురుగ్రాములో రూ.8710, నోయిడాలో రూ.8710గా ఉంది.
మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం, వెండి ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే పసిడికి డిమాండ్ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7970గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8695 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,08,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications