Gold Price Today: ఈవారం ప్రారంభం నుంచి బంగారం ధరలు ఊహించని మలుపు తిరిగాయి. గతవారం వరుసగా పడిపోయిన గోల్డ్ ధరలు పతనాన్ని చూసిన భారతీయ కొనుగోలుదారులు ఈవారం మరింతగా రేట్లు తగ్గుతాయని భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా రివర్స్ అయ్యాయి. కార్తీకమాసంలో పెళ్లిళ్లతోపాటు ఇతర శుభకార్యాలకు షాపింగ్ ఆలస్యం చేసిన చాలా మంది రేట్లు పెరగటంతో లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో గోల్డ్ షాపుకు వెళ్లటానికి ముందు నేడు పెరిగిన రిటైల్ విక్రయ ధరలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పనిసరిగా గుర్తించాల్సి ఉంటుంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.3,000 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7145, ముంబైలో రూ.7145, దిల్లీలో రూ.7160, కలకత్తాలో రూ.7145, బెంగళూరులో రూ.7145, కేరళలో రూ.7145, పూణేలో రూ.7145, వడోదరలో రూ.7150, అహ్మదాబాదులో రూ.7150, జైపూరులో రూ.7160, లక్నోలో రూ.7160, కోయంబత్తూరులో రూ.7145, మంగళూరులో రూ.7145, నాశిక్ లో రూ.7148, మైసూరులో రూ.7145, అయోధ్యలో రూ.7160, బళ్లారిలో రూ.7145, నోయిడాలో రూ.7160, గురుగ్రాములో రూ.7160 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.3300 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిగణిస్తే.. చెన్నైలో రూ.7795, ముంబైలో రూ.7795, దిల్లీలో రూ.7810, కలకత్తాలో రూ.7795, బెంగళూరులో రూ.7795, కేరళలో రూ.7795, పూణేలో రూ.7795, వడోదరలో రూ.7800, అహ్మదాబాదులో రూ.7800, జైపూరులో రూ.7810, లక్నోలో రూ.7810, కోయంబత్తూరులో రూ.7795, మంగళూరులో రూ.7795, నాశిక్ లో రూ.7798, మైసూరులో రూ.7795, అయోధ్యలో రూ.7810, బళ్లారిలో రూ.7795, నోయిడాలో రూ.7810, గురుగ్రాములో రూ.7810 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7145గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7795 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7145గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7795 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications