Gold Rate: సోమవారం బొమ్మ చూపించిన గోల్డ్ ధర.. ఏమిరా బాలరాబు బంగారం కొనేదెలా, రూ.1600 అప్
Gold Price Today: డిసెంబర్ నెలలో తిరిగి పసిడి ధరల పరుగులు కొనసాగుతున్నాయి. దీంతో చాలా మంది గందరగోళ పరిస్థితులను చూస్తున్నారు. ఇలా అయితే జనవరిలో రేట్లు అసలు తగ్గుతాయా అనే అనుమానాలు సైతం చాలా మందిలో కొనసాగుతున్నాయి. చాలా మంది నిపుణులు మాత్రం ప్రస్తుత పెరుగుదల స్వల్పకాలిక ప్రభావాన్ని కలిగి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ ధరలను పరిశీలించటం చాలా ముఖ్యం.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.1,200 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ ప్రముఖ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7130, ముంబైలో రూ.7130, దిల్లీలో రూ.7145, కలకత్తాలో రూ.7130, బెంగళూరులో రూ.7130, కేరళలో రూ.7130, వడోదరలో రూ.7135, అహ్మదాబాదులో రూ.7135, జైపూరులో రూ.7145, లక్నోలో రూ.7145, కోయంబత్తూరులో రూ.7130, పాట్నాలో రూ.7135, మంగళూరులో రూ.7130, నాశిక్‍లో రూ.7133, అయోధ్యలో రూ.7145, బళ్లారిలో రూ.7130, గురుగ్రాములో రూ.7145, నోయిడాలో రూ.7145 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1,600 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన పసిడి విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7778, ముంబైలో రూ.7778, దిల్లీలో రూ.7793, కలకత్తాలో రూ.7778, బెంగళూరులో రూ.7778, కేరళలో రూ.7778, వడోదరలో రూ.7783, అహ్మదాబాదులో రూ.7783, జైపూరులో రూ.7793, లక్నోలో రూ.7793, కోయంబత్తూరులో రూ.7778, పాట్నాలో రూ.7783, మంగళూరులో రూ.7778, నాశిక్‍లో రూ.7781, అయోధ్యలో రూ.7793, బళ్లారిలో రూ.7778, గురుగ్రాములో రూ.7793, నోయిడాలో రూ.7793గా కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7130గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7778 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7130గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7778 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,00,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.


Click it and Unblock the Notifications