Gold Rate: రాకెట్ దూకుడులో గోల్డ్.. సోమవారం రూ.2,200 అప్, ఏపీ-తెలంగాణ షాకింగ్ రేట్లివే..
Gold Price Today: ప్రపంచ వ్యాప్తంగా పసిడి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఇవాళ భారతదేశంలో గోల్డ్ రేట్లు రికార్డు గరిష్ఠాలకు చేరుకున్నాయి. గోల్డ్‌మాన్ శాక్స్ అంచనాల ప్రకారం 2025 ప్రారంభం నాటికి ధరలు మరింతగా పెరుగుతాయని వెల్లడించిన కొన్ని రోజులకే రేట్లు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి.
22 క్యారెట్ల గోల్డ్ రేట్లు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.2,000 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.6980, ముంబైలో రూ.6980, దిల్లీలో రూ.6995, కలకత్తాలో రూ.6980, బెంగళూరులో రూ.6980, కేరళలో రూ.6980, వడోదరలో రూ.6985, జైపూరులో రూ.6995, లక్నోలో రూ.6995, మంగళూరులో రూ.6980, నాశిక్‌లో రూ.6983, అయోధ్యలో రూ.6995, బళ్లారిలో రూ.6980, గురుగ్రాములో రూ.6995, నోయిడాలో రూ.6995 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.2,200 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7615, ముంబైలో రూ.7615, దిల్లీలో రూ.7630, కలకత్తాలో రూ.7615, బెంగళూరులో రూ.7615, కేరళలో రూ.7615, వడోదరలో రూ.7620, జైపూరులో రూ.7630, లక్నోలో రూ.7630, మంగళూరులో రూ.7615, నాశిక్‌లో రూ.7618, అయోధ్యలో రూ.7630, బళ్లారిలో రూ.7615, గురుగ్రాములో రూ.7630, నోయిడాలో రూ.7630గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6980గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7615 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.98,000 వద్ద స్థిరంగా ఎలాంటి మార్పులు లేకుండా విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఆర్థిక ఆరోగ్యం, స్థిరత్వాన్ని కొనసాగించే క్రమంలో.. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల పసిడి కొనుగోళ్లు ప్రస్తుత ధరల పెరుగుదలకు కీలక కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పసిడి డిమాండ్ పెరగడం, ముఖ్యంగా ఆర్థిక అస్థిరతలు లేదా మునుపటి కంటే ఎక్కువ రిస్క్ ఉన్న సమయంలో ధరలను ప్రభావితం చేస్తుంది. కేంద్ర బ్యాంకులు తమ ఆర్థిక విధానాలను సానుకూలంగా మార్చినప్పుడు, గోల్డ్ హోల్డింగ్స్ ఎక్కువగా ఉండటాన్ని భద్రతగా భావించి, భారీగా కొత్త నిల్వలు పెంచుతుంటాయి. ఇది పరోక్షంగా మార్కెట్లలో ధరల పెరుగుదలకు దారితీస్తుంటాయి.


Click it and Unblock the Notifications