Gold Price Today: వరుసగా నాలుగు రోజుల నుంచి పసిడి ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో భారతీయ కొనుగోలుదారులకు రేట్లు చూసి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. మహాశివరాత్రికి ముందు పసిడి ధరలు నిరంతరం పెరగటంతో షాపు యజమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో తమ వ్యాపారం కళ తప్పుతోందని వారు ఆవేదన చెందుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.3,500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8070, ముంబైలో రూ.8070, దిల్లీలో రూ.8085, కలకత్తాలో రూ.8070, బెంగళూరులో రూ.8070, కేరళలో రూ.8070, వడోదరలో రూ.8075, జైపూరులో రూ.8085, లక్నోలో రూ.8085, కోయంబత్తూరులో రూ.8070, మధురైలో రూ.8070, మంగళూరులో రూ.8070, నాశిక్ లో రూ.8073, అయోధ్యలో రూ.8085, బళ్లారిలో రూ.8070, గురుగ్రాములో రూ.8085, నోయిడాలో రూ.8085 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.3900 భారీ పెరుగుదలను చూస్తున్నాయి. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8804, ముంబైలో రూ.8804, దిల్లీలో రూ.8819, కలకత్తాలో రూ.8804, బెంగళూరులో రూ.8804, కేరళలో రూ.8804, వడోదరలో రూ.8809, జైపూరులో రూ.8819, లక్నోలో రూ.8819, కోయంబత్తూరులో రూ.8804, మధురైలో రూ.8804, మంగళూరులో రూ.8804, నాశిక్ లో రూ.8807, అయోధ్యలో రూ.8819, బళ్లారిలో రూ.8804, గురుగ్రాములో రూ.8819, నోయిడాలో రూ.8819గా ఉన్నాయి.
నిరంతర పెరుగుదల ఎందుకు..?
వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై వాణిజ్య పన్నులను వరుసగా ప్రకటిస్తున్న వేళ సెంట్రల్ బ్యాంకుల నుంచి ఇప్పటికే సేఫ్ హెవెన్ గోల్డ్ కోసం నిరంతరం డిమాండ్ పెరుగుతూనే ఉంది. దీనికి తోడు చరిత్రలో తొలిసారిగా అమెరికా దిగ్గజ బ్యాంకులైన హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గన్ ఇటీవల బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి తమ పసిడి నిల్వలను భౌతికంగా వెనక్కి తీసుకున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం పసిడి ధర ఔన్సుకు 3000 డాలర్లకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా గోల్డ్ భారీగా ధర పెరుగుతూ భవిష్యత్తు ధరలపై క్లారిటీ వస్తోంది.
మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది.
తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.8070గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8804 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,08,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
More From GoodReturns

Gold Prices: గోల్డ్ మార్కెట్లో అతిపెద్ద క్రాష్! ఇప్పుడు కొనాలా? అమ్మాలా? నిపుణుల సలహా ఇదే..!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications