బంగారం ధరలు ప్రస్తుతం చుక్కలను తాకుతున్నాయి. పసిడి అంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది. బంగారం ధర ఏకంగా లక్ష రూపాయలకు చేరుకుంటుందనే నిపుణుల అంచనాలు ఇంకా ఆందోళనలోకి నెట్టివేస్తున్నాయి. అయితే రానున్న కాలంలో బంగారం ధరలు తగ్గుతాయా అంటే ఖచ్చితంగా చెప్పలేం కాని తగ్గే అవకాశాలకు దారులు ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. భవిష్యత్తులో బంగారం ధర ఏకంగా రూ. 25 వేలు తగ్గే అవకాశాలను కొట్టి పారేయలేమని నిపుణులు చెబుతున్నారు.
దీనికి ప్రధాన కారణంగా వారు చైనా తీసుకునే నిర్ణయాలను ప్రస్తావిస్తున్నారు. చైనా కనుక ఓ కీలక నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో బంగారం ధర రూ. 25 వేల వరకు తగ్గుతుందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం చైనా వద్ద అపారమైన బంగారం నిల్వలు ఉన్నాయి. అయితే అదే సమయంలో ఆర్థిక సంక్షోభం కూడా చైనాను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో చైనా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి తన వద్ద ఉన్న బంగారాన్ని బహిరంగ మార్కెట్లో వేలానికి పెడితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

చైనా తీసుకునే ఈ ఒక్క నిర్ణయం వల్ల బంగారం ధర రూ. 25,000 తగ్గుతుందనే వాదన అందరికీ అతిశయోక్తి కావచ్చు. ఇది విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన ఆర్థిక వాస్తవికత కాదు కాని.. మార్కెట్లో చైనా చర్యలు బంగారం ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపగలవు. ప్రపంచ బంగారు మార్కెట్లో చైనా ప్రధాన పాత్ర పోషిస్తోంది.దిగుమతి కోటాల్లో మార్పులు లేదా ప్రభుత్వ విధానాలు వంటి దాని చర్యలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.
ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే అమెరికా - చైనా మధ్య వాణిజ్య ఒప్పందం బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది. వాణిజ్య చర్చల నుండి వచ్చే సానుకూల సంకేతాలు పెట్టుబడిదారుల భయాన్ని తగ్గిస్తాయి. సురక్షితమైన ఆస్తిగా బంగారం ఆకర్షణను తగ్గిస్తాయి. ఇది ధర తగ్గుదలకు దారితీస్తుంది. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, కేంద్ర బ్యాంకు విధానాలు వంటి అనేక ఇతర అంశాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. చైనా చర్యలు బంగారం ధరలను ప్రభావితం చేయవచ్చు, కానీ రూ. 25,000 తగ్గుదల అనేది ఒక తీవ్రమైన పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ఆధారంగా అది వాస్తవిక అంచనా కాకపోవచ్చు. కాని చైనా తీసుకునే నిర్ణయంతో ఆ స్థాయిలో బంగారం ధరలు తగ్గే అవకాశం అయితే ఉంది.
బంగారం ధరలను గతేదాడి నుంచి మనం చూసుకున్నట్లయితే 75 వేల నుంచి 95 వేల వరకు చేరుకుంది. ఏడాది కాలంలోనే 25 వేల నుంచి 35 వేల వరకు బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం ధర పెరగడానికి చైనానే ప్రధాన కారణమని చెప్పక తప్పదు. ఎందుకంటే గడిచిన పదేళ్లలో చైనా విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేసింది. ఎక్కువగా తన పెట్టుబడులను బంగారం రూపంలో నిల్వ చేసుకునేందుకే ఆసక్తి చూపింది. అమెరికా డాలర్ మీద ఆధారపడకుండా ఉండేందుకు చైనా ఇలా బంగారాన్ని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సెంట్రల్ బ్యాంకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రతి సంవత్సరం దాదాపు 100 టన్నుల చొప్పున ..గడిచిన పదేళ్లలో దాదాపు 1000 మెట్రిక్ టన్నుల వరకు బంగారాన్ని కొనుగోలు చేసిందని సమాచారం. ఒక్క 2023లోనే చైనా దాదాపు 250 టన్నుల వరకు బంగారం కొనుగోలు చేసిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూసుకున్నట్లయితే ప్రస్తుతం చైనా వద్ద దాదాపు 2300 టన్నుల బంగారం నిల్వలో ఉంది.
ప్రపంచ స్టాక్ మార్కెట్లు దెబ్బ తిన్నప్పుడల్లా చైనా.. బంగారం మీద ఎక్కువగా పెట్టుబడులను పెట్టుకుంటూ పోయింది. అలాగే పశ్చిమ దేశాల మీద ఆధార పడకుండా ఉండేందుకు కూడా బంగారం మీద చైనా తన దృష్టిని పెట్టింది. దీంతో బంగారం ధరలు పెరగడం ప్రారంభించాయి. గడిచిన పదేళ్లలో దాదాపు బంగారం ధర మూడు రెట్లు పెరగగా..కేవలం 5 ఏళ్లలోనే రెట్టింపు అయింది. ఇక కరోనా సంక్షోభంతో ప్రపంచ దేశాలు అల్లాడుతుంటే చైనా మాత్రం బంగారం మీద తన ఫోకస్ పెట్టింది. కరోనా తర్వాత కూడా బంగారం మీదనే ఫోకస్ పెట్టింది.
అయితే చైనా ఆర్థిక సంక్షోభం వైపు ప్రయాణం చేస్తుందా అంటే అవుననే సమాధానం నిపుణుల నుంచి వస్తోంది. ప్రస్తుత గణాంకాలను చూసినట్లయితే చైనా వృద్ధి రేటు దాదాపు 3 శాతం మేర తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఇక అమెరికా విధించిన సుంకాల కారణంగా చైనా ఆర్థిక ప్రగతి ప్రశ్నార్థకమై.. నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. యాపిల్ వంటి సంస్థలు చైనాను వీడటానికి రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే ఏకైక మార్గం నిల్వలో ఉన్న బంగారాన్ని బహిరంగ మార్కెట్లో పెట్టడమే.. తద్వారా చైనా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటమే కాకుండా బంగారం ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి ధరల్లో మళ్ళీ కదలిక.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications