Gold Price: రోజులు గడుస్తున్నా పసిడి ధరల పరుగుల్లో మాత్రం మార్పు కనిపించటం లేదు. రంజాన్ పండుగ రోజు సైతం పసిడి ధరల భగభగలు కొనసాగాయి. దీంతో పండుగ రోజు నిస్సత్తువగా గోల్డ్ లవర్స్ ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం కొనుగోలు ఆలోచనను చంపేసుకుంటున్నారు.
నేడు 22 క్యారెట్ల పసిడి ధరలు 10 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.100 స్వల్ప పెరుగుదలతో కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా పసిడి ధరలు పైపైకి పెరగటమే తప్ప తగ్గటం అనే మాట లేకుండా ముందుకు సాగుతున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో రిటైల్ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.67,060, ముంబైలో రూ.66,110, దిల్లీలో రూ.66,260, కలకత్తాలో రూ.66,110, బెంగళూరులో రూ.66,110, కేరళలో రూ.66,110, వడోదరలో రూ.66,160, జైపూరులో రూ.66,260, లక్నోలో రూ.66,260, నాశిక్ లో రూ.66,140, అయోధ్యలో రూ.66,260, బళ్లారిలో రూ.66,110, గురుగ్రాములో రూ.66,260, నోయిడాలో రూ.66,260 వద్ద ఉన్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నిన్నటి కంటే రూ.100 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేటి రిటైల్ గోల్డ్ విక్రయ రేట్లను పరిగణిస్తే.. చెన్నైలో రూ.73,160, ముంబైలో రూ.72,120, దిల్లీలో రూ.72,270, కలకత్తాలో రూ.72,120, బెంగళూరులో రూ.72,120, కేరళలో రూ.72,120, వడోదరలో రూ.72,170, జైపూరులో రూ.72,270, లక్నోలో రూ.72,270, నాశిక్ లో రూ.72,150, అయోధ్యలో రూ.72,270, బళ్లారిలో రూ.72,120, గురుగ్రాములో రూ.72,270, నోయిడాలో రూ.72,270గా కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.66,110గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,120 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను గమనిస్తే చాలా కాలం తర్వాత స్వల్పంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధర కేజీకి రూ.500 తగ్గిన తర్వాత నేడు రూ.88,500 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications