అంతర్జాతీయవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతుండటంతో బంగారంపై ఆ ప్రభావం పడుతోంది. గత ఐదారు రోజులుగా తగ్గిన బంగారం ధరలు మంగళవారం ప్రారంభంలో పెరిగి, మళ్లీ తగ్గుముఖం పట్టాయి. బంగారంపై పెట్టుబడి పెట్టే అంశంలో ఇన్వెస్టర్లు కూడా కాస్త గందరగోళంలో ఉన్నారు. ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతాయో.. భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే గందరగోళంలో ఉన్నారు.

5 సెషన్‌లలో రూ.5,000 తగ్గింది
గోల్డ్ ఫ్యూచర్స్ మంగళవారం ఉదయం 0.27 శాతం పెరిగి రూ.39,624కు చేరుకుంది. కిలో వెండి ధర 0.22 శాతం పెరిగి రూ.36,287గా ఉంది. ఎంసీఎక్స్‌లో ఈ రోజు ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.480 (1.2 శాతం) తగ్గి రూ.39,037కు చేరుకుంది. బంగారం ధర గత ఐదు సెషన్‌లలోనే ఏకంగా రూ.5,000కు పైగా తగ్గింది.

44,500 నుండి రూ.40,000 దిగువకు
ఐదు సెషన్లకు ముందు బంగారం ధర రూ.44,500గా ఉంది. ఇప్పుడు రూ.40,000కు దిగువకు వచ్చింది. వెండి ధర ఎంసీఎక్స్‌లో ఈ రోజు 1.7 శాతం తగ్గి రూ.35,593కు చేరుకుంది. గత ఐదు సెషన్లలో వెండి ధర రూ.4,200 తగ్గింది. అంటే 10 శాతం తగ్గుదల నమోదు చేసింది.

1700 డాలర్ల నుండి 1511 డాలర్లకు
అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు తగ్గిపోయాయి. కొద్ది రోజుల క్రితం ఔన్స్ బంగారం 1700 డాలర్ల కంటే పైకి చేరుకుంది. ఇప్పుడు స్పాట్ గోల్డ్ ఔన్స్ 0.2 శాతం తగ్గి 1511 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు సెషన్‌లో 5 శాతం పడిపోయింది.

మద్దతు ధర
ఔన్స్ బంగారం 1535 డాలర్లకు తక్కువగా ఉన్నంత వరకు బలహీనంగానే ఉండవచ్చునని, తక్షణ మద్దతు ధర 1470 వద్ద కనిపిస్తోందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 1545 డాలర్లకు పైకి చేరుకుంటే మాత్రం బంగారం ధర పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

మరికొంతకాలం అస్థిరంగా..
బంగారం ధరలు మరికొంతకాలం అస్థిరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కారణంగా ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుండి పసిడి పెట్టుబడుల వైపు మళ్లుతున్నారు. ఇటీవల వరకు భారీగా ధరలు ఉండటంతో పసిడి పెట్టుబడులు తగ్గినప్పటికీ, ఇప్పుడు ధరలు తగ్గడంతో మళ్లీ పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు.
More From GoodReturns

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!



Click it and Unblock the Notifications