హైదరాబాద్: దేశవ్యాప్తంగా బంగారం, వెండి రేట్లల్లో స్థిరత్వం నెలకొంది. శనివారం వాటి ధరల్లో పెరుగుదల గానీ, తగ్గుదల గానీ చోటు చేసుకోలేదు. బంగారం, వెండి ధరల్లో కొద్దిరోజులుగా నెలకొన్న అప్ అండ్ డౌన్స్‌కు బ్రేక్ పడింది. సాధారణంగా వీకెండ్‌లోనూ వాటి ధరల్లో కొద్దో, గొప్పో కదలికలు కనిపిస్తుంటాయి. ఈ వారాంతం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్ (MCX)లో బంగారం ధరల్లో స్థిరత్వం నెలకొంది. 10 గ్రాముల బంగారం ధర 48,710 రూపాయల వద్ద నిలిచింది.
బెంగళూరులో 22 గ్రాముల బంగారం ధర 44,650, 24 క్యారెట్లు 48,710 రూపాయలుగా నమోదైంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర 44,500 24 క్యారెట్లు 48,560 వద్ద నిలిచింది. విశాఖపట్నం, విజయవాడల్లో ఇవే రేట్లు పలుకుతున్నాయి. వెండి రేటు బెంగళూరుతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా ఉంటోంది. వెండి కిలో ఒక్కింటికి బెంగళూరులో 70,500 రూపాయల మేర నమోదు కాగా.. హైదరాబాద్, విశాఖపట్నంలల్లో 70,300 రూపాయల వద్ద నిలిచింది.

కాగా- అక్షయ తృతీయ నాడు పసిడి కొనుగోళ్లు, దానికి సంబంధించిన లావాదేవీలు పెద్ద ఎత్తున నమోదవుతుంటాయి. అక్షయ తృతీయ నాడు వీసమెత్తు బంగారమైన కొనుగోలు చేయాలనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఏడాది మొత్తం ఎలా గడిచినా.. ఆ సందర్భంగా బంగారు దుకాణాల ముందు బారులు తీరుతుంటారు కొనుగోలుదారులు. పది సంవత్సరాలుగా అక్షయ తృతీయ రోజు నాడు బులియన్ మార్కెట్‌లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేసుకుంటూ వచ్చాయి.
ఏప్రిల్ 24 2021లో 10 గ్రాముల బంగారం ధర 28,710 రూపాయలు కాగా.. ఆ మరుసటి ఏడాది మరింత తగ్గింది. మే 13 2013 అక్షయ తృతీయ నాడు ఎంసీఎక్స్‌లో లో దాని ధర 26,867గా నిలిచింది. మే 2, 2014లో 30,182, ఏప్రిల్ 21 2015లో 26,803, మే 9 2016లో 29,805, ఏప్రిల్ 28 2017లో 28,872, ఏప్రిల్ 18 2018లో 31,410, మే 7 2019లో 31,739 రూపాయలు పలికింది బంగారం ధర. ఓ మోస్తరు స్థాయి ధరలకు అక్కడితో బ్రేక్ పడింది.
ఆ మరుసటి ఏడాది నాటికి పసిడి ధర అమాంతం పెరిగింది. లాంగ్ జంప్ చేసింది. 2020లో ఏప్రిల్ 27వ తేదీన వచ్చిన అక్షయ తృతీయ నాటికి బంగారం ధర 46,353 రూపాయలకు పెరిగింది. బంగారం ధరల్లో 46.04 శాతం మేర పెరుగుదల కనిపించింది. కరోనా వైరస్ ఆరంభమైన తొలి రోజుల్లోనూ బంగారం ధరల్లో భారీ పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది ఆ రేటు మరింత పెరిగింది. శుక్రవారం నాటి అక్షయ తృతీయ నాడు ఎంసీఎక్స్ వద్ద బంగారం రేటు 47,452 వద్ద నిలిచింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications