For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రోజు బంగారం ధర ఎంత ఉందంటే? మార్చిలో రూ.3,000 తగ్గుదల

|

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం ధరలు సోమవారం పడిపోయాయి. మధ్యాహ్నం గం.1.20 సమయానికి ఏప్రిల్ ఫ్యూచర్ గోల్డ్ 10 గ్రాములకు 0.94 శాతం తగ్గి రూ.39,980 వద్ద నిలిచింది. అంతకుముందు సెషన్‌లో ఎంసీఎక్స్‌లో రూ.40,721 వద్ద ప్రారంభమై, రూ.40,358 వద్ద క్లోజ్ అయింది. వీటి కంటే ధర ఇప్పుడు తక్కువగా ఉంది. తొలుత స్వల్పంగా పెరిగి ఆ తర్వాత తగ్గింది.

వెంటిలెటర్లు తయారు చేయనున్న మహీంద్రా, వేతనమంతా కరనా ఫండ్‌కు ఆనంద్ మహీంద్రావెంటిలెటర్లు తయారు చేయనున్న మహీంద్రా, వేతనమంతా కరనా ఫండ్‌కు ఆనంద్ మహీంద్రా

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లోను స్పాట్ గోల్డ్ ధరలు 0.2 శాతం పడిపోయి ఔన్స్‌కు 1,494.63గా ఉంది. అంతకుముందు సెషన్‌లో అంతర్జాతీయ మార్కెట్లో 3.1 శాతం పెరిగింది. కానీ ఈ రోజు స్వల్పంగా తగ్గాయి. అదే సమయంలో యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు 0.8 శాతం పెరిగి 1,496.70గా ఉంది.

హైదరాబాద్ మార్కెట్లో...

హైదరాబాద్ మార్కెట్లో...

హైదరాబాద్ మార్కెట్లో సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,693గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.39,703గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే పెద్దగా తేడా లేదు. స్వల్ప తగ్గుదల లేదా స్వల్ప పెరుగుదల ఉంది.

ఇండియాలో గత పది రోజుల్లో..

ఇండియాలో గత పది రోజుల్లో..

గత పది రోజుల్లో ఇండియాలో బంగారం ధర రూ.1000 నుండి రూ.2,000 మధ్య తగ్గింది. మార్చి 14న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.40,160గా ఉండగా, మార్చి 20వ తేదీ నాటికి రూ.39,600 ఉంది. నేడు రూ.39,630గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మార్చి 14న రూ.41,160 ఉండగా, మార్చి 20న రూ.40,600గా ఉంది. నేడు రూ.40,630గా ఉంది.

ఈ నెల రికార్డ్ హైతో రూ.3,000 తగ్గుదల

ఈ నెల రికార్డ్ హైతో రూ.3,000 తగ్గుదల

బంగారం ధరలు గత పక్షం రోజుల్లో భారీగా తగ్గుతున్నాయి. పెరగుదల మాత్రం స్వల్పంగానే ఉంది. రూ.45,000 గరిష్ట రికార్డుతో పోలిస్తే ఇప్పుడు భారీగానే తక్కువ ఉంది. ఈ నెలలో (మార్చి) బంగారం ధర గరిష్టంగా హైదరాబాద్‌లో పలికింది. మార్చి 7వ తేదీన రూ.44,488 ఉండగా, అతి తక్కువ ధర మార్చి 19న రూ.40,275గా ఉంది. మార్చి 1వ తేదీన ఈ ధర రూ.41,918గా ఉంది. అంటే 24 క్యారెట్ల బంగారం ధర మార్చి 1తో పోలిస్తే ఈ రోజు (రూ.41,693) తక్కువగానే ఉంది. అత్యధిక ధరతో (రూ.44,488) పోలిస్తే రూ.3,000 వరకు తగ్గింది. మార్చి 19న గరిష్ట ధరతో పోలిస్తే రూ.4,500 వరకు తక్కువగా ఉంది.

English summary

ఈ రోజు బంగారం ధర ఎంత ఉందంటే? మార్చిలో రూ.3,000 తగ్గుదల | Gold rate today: Gold falls below Rs 40,000

Highest gold price in Hyderabad for 24 karat gold in the month of March 2020 was 44,488 rupees per 10 grams while the lowest gold price was 40,275 rupees. Gold price on 01 Mar 2020 was 41,918 rupees per 10 grams.
Story first published: Monday, March 23, 2020, 16:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X