పసిడి ప్రియులకు లడ్డులాంటి వార్త.. బంగారం ధరలపై ఇప్పుడు కొత్త వార్త ఒకటి సోషల్ మీడియాని కుదిపేస్తోంది. డ్రాగన్ కంట్రీ చైనా తన దగ్గర దాచుకున్న బంగారాన్ని మార్కెట్లోకి వదిలింది. దీంతో పసిడి ధరలు భారీగా తగ్గనున్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచంలో బంగారం కొనుగోలులో కీలకంగా ఉన్న చైనా 2025 జూన్‌లో పసిడిపై పెట్టుబడులు పెట్టడం తగ్గించుకుంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో చైనా రికార్డు స్థాయిలో బంగారం మీద పెట్టుబడులు పెట్టింది.అయితే ఇప్పుడు బంగారం మీద పెట్టుబడులను పూర్తిగా తగ్గించుకుంది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపిన నివేదిక ప్రకారం చూస్తే.. 2025 మొదటి ఆరునెలల్లో డ్రాగన్ కంట్రీ రూ.64 వేల కోట్లకు పైగానే బంగారం ETFలలో ఇన్వెస్ట్ చేసింది.ఇది దేశ చరిత్రలోనే అత్యధిక పెట్టుబడిగా రికార్డుల్లోకెక్కింది. దీంతో బంగారం ధరలు భారీ పెరుగుదల చూసి సామాన్యులకు చుక్కలు చూపించాయి. జూన్‌లో బంగారు ఆభరణాల హోల్‌సేల్ డిమాండ్ 10 శాతం తగ్గింది. కొనుగోలు దారులు బంగారం అంటేనే భయపడే స్థితికి వచ్చారు.

ఈ పరిస్థితుల మధ్య చైనా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌లో చైనా 90 టన్నుల బంగారాన్ని మార్కెట్లో విక్రయించింది. దీంతో బంగారం ఎక్కువగా అందుబాటులోకి వస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. దీంతో డిమాండ్ తగ్గి ధరలు కూడా భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే చైనా మార్కెట్లోకి వదిలిన బంగారం గత 10 సంవత్సరాల సగటుతో పోలిస్తే తక్కువగానే చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో మొత్తం 678 టన్నుల బంగారం మాత్రమే సేల్ అయింది. ఇది గతేడాది కంటే 18 శాతం తగ్గుదలగా చెప్పుకోవచ్చు. ఇక చైనా బంగారాన్ని అధికమొత్తంలో దాచుకోవడంతో 2025 మొదటి అరు నెలల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 2016 తర్వాత ఇంత వేగంగా ధరలు పెరగడం ఇదే తొలిసారి.
చైనా సెంట్రల్ బ్యాంక్ (People's Bank of China) వరుసగా 8వ నెలలో కూడా బంగారం కొనుగోలు చేసింది. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలోనే 19 టన్నులు కొనుగోలు చేసింది. దీంతో చైనా బంగారం రిజర్వులు 2,299 టన్నులకు చేరుకున్నాయి. ఇక 2025 మేలో చైనా 89 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంది. ఇది ఏప్రిల్ నెలతో పోలిస్తే 21శాతం తక్కువ.గత ఏడాది మేతో పోలిస్తే 31 శాతం తక్కువ. నగల డిమాండ్ తగ్గడం దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
చైనా ప్రజలు బంగారాన్ని కేవలం నగలుగా కాకుండా పెట్టుబడి వనరుగా చూశారు.దీంతో బంగారం సంబంధిత రంగాల్లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. చైనా సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు కూడా బంగారాన్ని బలమైన పెట్టుబడి ఎంపికగా నిలబెడుతున్నాయి. చైనాలో పెరుగుతున్న బంగారం కొనుగోళ్లు ప్రపంచ డిమాండ్‌ను పెంచుతున్నాయి. భారత లో బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.. పెరుగుతున్న అమెరికన్ డాలర్ విలువ, ట్రెజరీ యీల్డ్స్ కారణంగా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

Gold Prices: గోల్డ్ మార్కెట్లో అతిపెద్ద క్రాష్! ఇప్పుడు కొనాలా? అమ్మాలా? నిపుణుల సలహా ఇదే..!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు



Click it and Unblock the Notifications