Gold Price Today: గడచిన వారం రోజులుగా పసిడి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. 10 గ్రాములకు రూ.3,000 పెరగటంతో సామాన్యులు హడలిపోతున్నారు. ప్రధానంగా అంతర్జాతీయంగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణంతో పసిడి ధరలు పెరుగుతున్నాయని విక్రేతలు చెబుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర ఈరోజు నిన్నటి కంటే రూ.1,400 పెరిగాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,550, ముంబైలో రూ.55,400, దిల్లీలో రూ.55,550, కలకత్తాలో రూ.54,000, కేరళలో రూ.54,000, వడోదరలో రూ.55,450, జైపూర్ లో రూ.55,550, లక్నోలో రూ.55,550, కోయంబత్తూరులో రూ.55,550, నాశిక్ లో రూ.55,430, మైసూరులో రూ.55,400, బళ్లారిలో రూ.55,400, గురుగ్రామ్‌లో రూ.55,550గా ఉన్నాయి.

ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం విషయానికి వస్తే ధర నిన్నటి కంటే రూ.1,530 మేర పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.60,600, ముంబైలో రూ.60,440, దిల్లీలో రూ.60,590, కలకత్తాలో రూ.60,440, కేరళలో రూ.60,440, వడోదరలో రూ.60,490, జైపూర్ లో రూ.60,590, లక్నోలో రూ.60,590, కోయంబత్తూరులో రూ.60,600, నాశిక్ లో రూ.60,470, మైసూరులో రూ.60,440, బళ్లారిలో రూ.60,440, గురుగ్రామ్‌లో రూ.60,590 వద్ద కొనసాగుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, గుంటూరు, విశాఖ, నెల్లూరు, కడప, కాకినాడ, అనంతపురం, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రిటైల్ విక్రయ ధర రూ.55,400గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.60,440గా కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరను పరిశీలిస్తే.. కేజీకి రూ.1,500 పెరగటంతో రిటైల్ విక్రయ ధర రూ.77,000గా ఏపీ, తెలంగాణలో ఉంది.


Click it and Unblock the Notifications