రూ.16,400 పెరిగిన బంగారం ధర.. కొనుగోలు చేయలేక భోరున విలపిస్తున్న మహిళలు..
పసిడి ప్రియులకు ఆగస్టు నెల చివరలో దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఒక్కరోజులోనే ఏకంగా బంగారం ధర 100 గ్రాములు రూ.16, 400 పెరిగింది. 10 గ్రాములు అయితే రూ. 164 పెరిగింది. ఇక సెప్టెంబర్ నెలలో బంగారం ధరలు తగ్గుతాయా లేక ఇదే విధంగా పెరుగుతాయా అనే ఆందోళనలో సామాన్యులు ఉన్నారు. పసిడి వైపు వారు చూడటం మానేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారతీయ వస్తువులపై 50 శాతం సుంకం విధించడంతో బంగారం ధరల్లో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి.
ఆగస్టు 26 నుంచి 30 వరకు.. కేవలం 4 రోజుల్లోనే 100 గ్రాముల Gold ధర రూ.27,600కు పైగా పెరిగింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,700కు పైగా పెరిగింది.
ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 24కే బంగారం ధర రూ.1,04,950 వద్ద ట్రేడవుతోంది.సాధారణంగా భారతదేశంలో పండుగ సమయాల్లో బంగారం డిమాండ్ ఎప్పుడూ చాలా ఎక్కువగానే ఉంటుంది. దసరా, దీపావళి వంటి పండుగలకు ముందు జ్యువెలరీ షాపులు తమ స్టాక్‌ను తిరిగి నింపుకుంటాయి. అయితే అధిక ధరల కారణంగా రిటైల్ కొనుగోలు కొంత తగ్గింది. పెట్టుబడిదారులు బంగారం మీద పెట్టుబడులు ఎక్కువగా పెట్టారు.

ఈరోజు Gold ధరలు (ఆగస్టు 30, 2025)
24 క్యారెట్లు: 10 గ్రాములకు రూ. 1,04,950 (రూ. 1,640 పెరుగుదల)
22 క్యారెట్లు: 10 గ్రాములకు రూ. 96,200 (రూ. 1,500 పెరుగుదల)
8 క్యారెట్లు: 10 గ్రాములకు రూ. 78,710 (రూ. 1,230 పెరుగుదల)
ఇక 100 గ్రాముల ధరలు:
24 క్యారెట్లు - రూ. 10,49,500 (రూ. 1,6400 పెరుగుదల)
22 క్యారెట్లు - రూ. 9,62,000 (రూ. 1,5000 పెరుగుదల)
18 క్యారెట్లు - రూ. 7,87,100 (రూ. 1,2300 పెరుగుదల)
నగరాల వారీగా బంగారం ధరలు
చెన్నై: 22K - రూ. 96,200; 24K - రూ. 1,04,950
బెంగళూరు: 22K - రూ. 96,200; 24K - రూ. 1,04,950
హైదరాబాద్: 22K - రూ. 96,200; 24K - రూ. 1,04,950
ముంబై: 22K - రూ. 96,200; 24K - రూ. 1,04,950
భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అమెరికా విధిస్తున్న కొత్త సుంకాలు మరియు గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్ కూడా బంగారం మీద సురక్షిత పెట్టుబడిగా డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఈ కారణాల వల్లే బంగారం 2025లో ఇప్పటివరకు 28 శాతం రాబడి ఇచ్చింది. దేశీయ మార్కెట్‌లో కూడా Gold ధరలు గణనీయంగా పెరిగాయి. ఆగస్టులో ఒక్క నెలలోనే 1.6 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.లక్షా నాలుగు వేల మార్కుకి చేరాయి. ఇది సంవత్సర ఆరంభం నుండి ఇప్పటి వరకు 31శాతం పెరుగుదలని సూచిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications