భారతదేశంలో బంగారం ధరలు ఏడు రోజుల నిరంతర పెరుగుదల అనంతరం అక్టోబర్ 11న కర్వా చౌత్ రోజున ఆకస్మికంగా పడిపోయాయి. రికార్డు స్థాయిలో కొనసాగిన ర్యాలీకి విరామం లభించింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.440 తగ్గి రూ.1,23,710కి చేరుకోగా, 100 గ్రాముల ధర రూ.4,400 తగ్గి రూ.12,37,100కి పడిపోయింది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు మాత్రం రికార్డు స్థాయిలో కొనసాగుతూ మార్కెట్లో ఆసక్తికరమైన మిశ్రమ ధోరణి కనిపించింది.
గత వారం బంగారం ధరలు వరుసగా పెరుగుతూ ఏడు రోజుల్లో 100 గ్రాములకు రూ.56,200కు పైగా పెరిగాయి. అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 9 వరకు బంగారం ఒక్కరోజు కూడా తగ్గలేదు. అయితే, శుక్రవారం గాజా ప్రాంతంలో శాంతి చర్చలు పురోగమించడంతో గ్లోబల్ మార్కెట్లలో బంగారం మీద ఉన్న సురక్షిత పెట్టుబడుల ఒత్తిడి తగ్గింది. ఫలితంగా అధిక స్థాయిలో లాభాల బుకింగ్ జరిగి, బంగారం ధరలు పడిపోయాయి.

22 క్యారెట్ బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.400 తగ్గి రూ.1,11,340కు చేరుకుంది. 100 గ్రాములకు రూ.4,000 తగ్గి రూ.11,34,000కి పడిపోయింది. అలాగే 18 క్యారెట్ బంగారం ధరలు 10 గ్రాములకు రూ.330 తగ్గి రూ.92,780కి చేరుకున్నాయి. వెండి ధరలు మాత్రం కొత్త రికార్డు గరిష్టాలను తాకాయి. 1 కిలోకు రూ.1,48,499 గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి మాట్లాడుతూ.. గాజా శాంతి ఒప్పందం పురోగమించడంతో బంగారం సురక్షిత పెట్టుబడిగా ఆకర్షణ కోల్పోయింది. అదనంగా, అమెరికా డాలర్ విలువ 99 దాటడంతో అంతర్జాతీయ Gold ధరలపై ఒత్తిడి ఏర్పడింది. లాభాల స్వీకరణతో బంగారం ర్యాలీ ఆగిపోయిందని తెలిపారు.
న్యూయార్క్ ఫెడ్ అధ్యక్షుడు జాన్ విలియమ్స్ విధాన సడలింపుపై సూచనలిచ్చినా.. ద్రవ్యోల్బణ ఆందోళనలు కొనసాగడంతో పెట్టుబడిదారులు జాగ్రత్త ధోరణి అవలంబించారు. అంతేకాకుండా, అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా కీలక ఆర్థిక డేటా విడుదల ఆలస్యం కావడం కూడా మార్కెట్లలో అస్థిరతను పెంచింది.MCXలో డిసెంబర్ 2025 గడువు ముగిసే Gold ఫ్యూచర్స్ ధర రూ.86 పెరిగి రూ.1,20,579 వద్ద ముగిసింది. రోజంతా బంగారం ధరలు రూ.1,20,023 నుండి రూ.1,21,350 మధ్య ఊగిసలాడాయి. అదే సమయంలో డిసెంబర్ వెండి ఫ్యూచర్స్ 1 కిలోకు రూ.613 తగ్గి రూ.1,45,711 వద్ద ట్రేడయ్యాయి.
బంగారం భవిష్యత్తు ధరల ప్రభావం గురించి కలాంత్రి మాట్లాడుతూ.. బంగారం 3940 డాలర్ల నుంచి 3910 డాలర్ల వద్ద మద్దతు పొందుతుంది. అంటే ఈ స్థాయిలో బంగారం ధర ఉన్నప్పుడు కొనుగోలు చేయాలని వారు సూచిస్తున్నారు. ఇక 4020 డాలర్ల నుంచి 4045డాలర్లవద్ద నిరోధకతను ఎదుర్కొంటుందన్నారు.అంటే ఈ స్థాయి వద్ద బంగారం కొనుగోలు ఆపాలని సూచిస్తున్నారు. భారత కరెన్సీలో చెప్పాలంటే బంగారం రూ.1,19,280 వద్ద ఉన్నప్పుడు కొనుగోలు దారులు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. అలాగే రూ.1,22,400 వద్దకు వెళ్లినా అంతకన్నా ఎక్కువ పెరిగినా కొనుగోళ్లు వెంటనే ఆపేయాలని చెబుతున్నారు. ఇక వెండి రూ.1,44,650 వద్దకు వచ్చినప్పుడు కొనుగోలు చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే రూ.1,48,450 వద్ద వెండి కొనుగోళ్లు ఆపేయడం మంచిదని సలహా ఇస్తున్నారు.
ఇక నిర్మల్ బ్యాంగ్ నివేదిక ప్రకారం.. వ్యాపారులు 10 గ్రాములకు రూ.1,21,700 వద్ద బంగారం విక్రయించి రూ.1,20,500 లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. స్టాప్ లాస్ రూ.1,22,500గా ఉంచవచ్చని తెలిపారు. వెండి విషయంలో కూడా రూ.1,48,500 వద్ద అమ్మి రూ.1,45,000 నుంచి రూ. 1,43,000 లక్ష్యాన్ని లక్ష్యంగా పెట్టుకోవచ్చని సూచించారు.
పండుగ సీజన్‌లో బంగారం ధరలు పడిపోవడం వినియోగదారులకు కొనుగోలు అవకాశం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు బంగారం, వెండి రెండింటినీ ద్రవ్యోల్బణ రక్షణ సాధనాలుగా పరిగణించి, ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. JP మోర్గాన్, గోల్డ్‌మన్ సాచ్స్ అంచనాలు చూస్తే వణుకు పుట్టడం ఖాయం..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

Gold: దుబాయ్‌లో డిస్కౌంట్‌కు లభిస్తున్న బంగారం.. అసలు కారణం ఇదే!

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!



Click it and Unblock the Notifications