ఈ ఏడాది తొలి రోజునే అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. డిసెంబర్ 26న స్పాట్ గోల్డ్ ఔన్సుకు ఆల్‌టైమ్ రికార్డు స్థాయి 4,549.71 డాలర్లకి చేరిన తర్వాత.. కొద్దిరోజుల లాభాల స్వీకరణ కారణంగా ధరలు తగ్గాయి. అయితే 2026 ప్రారంభంతో మళ్లీ బులియన్‌లో కొనుగోళ్ల జోరు పెరిగింది. గురువారం నాటికి స్పాట్ గోల్డ్ ధర దాదాపు 2 శాతం పెరిగి ఔన్సుకు 4,397.66 డాలర్ల వద్ద ట్రేడైంది. అంతకుముందు బుధవారం ఇది రెండు వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇక ఫిబ్రవరి డెలివరీకి సంబంధించిన అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 1.6 శాతం పెరిగి ఔన్సుకు 4,409.90 డాలర్లకి చేరాయి. ఇది పెట్టుబడిదారుల్లో Gold పట్ల ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
FXTM సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ లుక్మాన్ ఒటునుగా అభిప్రాయం ప్రకారం.. విలువైన లోహాలు 2026ను సానుకూలంగా ప్రారంభించాయి. 2025 చివర్లో జరిగిన లాభాల స్వీకరణ తర్వాత.. ఇప్పుడు భౌగోళిక రాజకీయ ప్రమాదాలు, ఈ ఏడాది అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గవచ్చన్న అంచనాలు బంగారానికి మద్దతుగా మారాయని తెలిపారు.

ఇక భౌతిక బంగారం డిమాండ్ విషయానికి వస్తే.. దాదాపు రెండు నెలల తర్వాత తొలిసారిగా భారత్, పొరుగుదేశం చైనాలో బంగారం ప్రీమియంతో ట్రేడవుతోంది. ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిల నుంచి ధరలు కొంత దిద్దుబాటుకు గురవడంతో.. రిటైల్ కొనుగోలుదారులు మళ్లీ మార్కెట్‌లోకి వచ్చారు. పెళ్లిళ్ల సీజన్, పండుగల డిమాండ్ కూడా భారత్‌లో బంగారం కొనుగోళ్లకు అవకాశం కల్పిస్తోంది.
2025 సంవత్సరం బంగారం ధరలు పెరిగి పెట్టుబడిదారులకు లాభాల పంటను పండించాయి. ఆ ఏడాదిలో బులియన్ ధరలు ఏకంగా 64 శాతం పెరిగాయి. ఇది 1979 తర్వాత అతిపెద్ద వార్షిక లాభంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతలు, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు, అలాగే గోల్డ్ ETFలలో పెరిగిన పెట్టుబడులు ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
UBS విశ్లేషకుడు జియోవన్నీ స్టౌనోవో అభిప్రాయం ప్రకారం.. 2026లో బంగారం ధరలు మరింత పైకి ఎగబాకే అవకాశం ఉంది. ఔన్సుకు 5,000 డాలర్ల స్థాయిని లక్ష్యంగా పెట్టుకున్నాం. తక్కువ వాస్తవ వడ్డీ రేట్లు, ప్రపంచ ఆర్థిక ఆందోళనలు, అలాగే అమెరికా దేశీయ విధానాలపై ఉన్న అనిశ్చితి బంగారానికి అనుకూలంగా మారుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర బ్యాంకులు, పెద్ద పెట్టుబడిదారులు కౌంటర్‌పార్టీ రిస్క్‌కి దూరంగా ఉండేందుకు బంగారం వంటి నిజమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈ ఏడాది కనీసం రెండు సార్లు ఫెడ్ క్వార్టర్ పాయింట్ రేటు కోతలు చేయవచ్చని మార్కెట్ అంచనా వేస్తోంది. తక్కువ వడ్డీ రేట్ల వాతావరణంలో దిగుబడి లేని ఆస్తులు అయిన బంగారం లాంటి లోహాలు మెరుగైన ప్రదర్శన చూపుతాయని భావిస్తున్నారు.
బంగారంతో పాటు ఇతర విలువైన లోహాలు కూడా బలంగా కదిలాయి. సోమవారం ఆల్‌టైమ్ హై 83.62 డాలర్లని తాకిన తర్వాత స్పాట్ సిల్వర్ ఔన్సుకు 4.6 శాతం పెరిగి 74.52 డాలర్లకి చేరింది. ప్లాటినం కూడా ఇటీవల 2,478.50 డాలర్ల రికార్డు స్థాయికి చేరిన తర్వాత ఔన్సుకు 2,150.46 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి 2025లో 147 శాతం లాభాలను నమోదు చేయగా, పల్లాడియం గత ఏడాది 76 శాతం పెరిగి 15 ఏళ్లలో అత్యుత్తమ ప్రదర్శన చూపింది. అయితే CME విలువైన లోహాల ఫ్యూచర్లపై మార్జిన్లు పెంచడంతో.. ఇటీవల వ్యాపారులు లాభాలు బుక్ చేసుకోవడం వల్ల ధరల్లో స్వల్ప ఒడిదుడుకులు కనిపించాయి.
క్లుప్తంగా చెప్పాలంటే.. 2026 ప్రారంభంలో బంగారం సహా విలువైన లోహాలు మళ్లీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గ్లోబల్ అనిశ్చితులు కొనసాగుతున్నంత కాలం బులియన్ మార్కెట్‌లో ఊపందుకోవడం కొనసాగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!



Click it and Unblock the Notifications