పసిడి ధర పైపైకి వెళుతుంది. కరోనా కేసులు తగ్గడం.. మార్కెట్ స్థిరపడటంతో బంగారానికి మళ్లీ డిమాండ్ వచ్చింది. దీంతోపాటు పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో ధర పెరుగుతుంది. పసిడి ధరతోపాటు.. వెండి కూడా పెరుగుతుంది. దేశంలో బంగారం ధర 51 వేల మార్క్ మళ్లీ క్రాస్ చేసింది. ఆకాశమే హద్దుగా ధర దూసుకువెళుతుంది. భవిష్యత్‌లో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా పెరుగుతోంది. ఆదివారం తులం బంగారంపై రూ. వేయి వరకు పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్‌లో రూ.46,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050గా ఉంది. కిలో వెండిపై రూ.400 మేర పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 63,000 గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,050 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,050గా ఉంది. కరోనా వల్ల మొన్నటి వరకు కొనుగోలు ఆశించిన స్థాయిలో జరగలేదు. ఇప్పుడిప్పుడే మార్కెట్ పుంజుకుంటుంది. అందరూ బంగారంపై ఇన్వెస్ట్ మెంట్ చేస్తున్నారు. కొందరు రెగ్యులర్‌గా కొనుగోలు చేస్తున్నారు. అయితే డిమాండ్ బట్టి బంగారం ధర పెరుగుతుంది.


Click it and Unblock the Notifications