బంగారం ధరలపై జె.పి.మోర్గాన్ కీలక హెచ్చరిక.. లాభాల్లో పసిడిని అందుకోవాలంటే ఒకటే మార్గం..
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు,ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా డాలర్ బలహీనత నేపథ్యంలో బంగారం మళ్లీ పెట్టుబడిదారుల విశ్వసనీయ ఆస్తిగా మారుతోంది. ఈ పరిస్థితుల మధ్య జె.పి. మోర్గాన్ ప్రైవేట్ బ్యాంక్ ఒక కీలక అంచనాను విడుదల చేసింది. 2026 చివరి నాటికి బంగారం ఔన్సు ధర 5,000 డాలర్లకు చేరే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రస్తుత మారకపు రేటు ($1 = రూ. 88.65)ను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ అంచనా వాస్తవమైతే, భారతదేశంలో బంగారం ఔన్సుకు ధర రూ. 4.43 లక్షలుకు చేరుతుంది. ఒక గ్రాము బంగారం ధర దాదాపు రూ. 15,558 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కలో దిగుమతి సుంకం (6%), GST (3 శాతం) చేర్చితే, భారత వినియోగదారులకు తుది ధర మరింత ఎక్కువగా ఉంటుంది.

జె.పి. మోర్గాన్ గ్లోబల్ మాక్రో, స్థిర ఆదాయ వ్యూహ విభాగం అధిపతి అలెక్స్ వోల్ఫ్ ప్రకారం.. బంగారం ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణం కేంద్ర బ్యాంకుల భారీ బంగారం కొనుగోళ్లు అని చెబుతున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో దీని ధోరణి ఎక్కువగా ఉందని చెబుతున్నారు. వోల్ఫ్ మాట్లాడుతూ.. ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా ఇంకా చాలా తక్కువగా ఉంది. ధరలు పెరగడం వల్ల కొనుగోళ్లు మందగించినా, మేము ఇంకా వాటిని కొనసాగిస్తున్నామని అన్నారు.
2025 సెప్టెంబర్ వరకు.. ప్రపంచ కేంద్ర బ్యాంకులు తమ నిల్వలకు 634 టన్నుల బంగారంను జోడించాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక వెల్లడించింది. ఈ కొనుగోళ్లు బంగారం మార్కెట్‌లో స్థిరమైన డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయి. ఇది ధరలను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
జె.పి. మోర్గాన్ చేజ్ సీఈఓ జామీ డైమన్ కూడా ఇటీవల బంగారం పై వ్యాఖ్యానిస్తూ.. ప్రస్తుత గ్లోబల్ పరిస్థితుల్లో బంగారం ఔన్సుకు 5 వేల డాలర్ల నుంచి 10 వేల డాలర్ల వరకు పెరగవచ్చని అన్నారు. అయితే, తాను వ్యక్తిగతంగా Gold కొననని, దానిని నిల్వ చేయడానికి 4 శాతం ఖర్చవుతుందని తెలిపారు. అయినప్పటికీ ఇలాంటి వాతావరణంలో కొంత బంగారం పోర్ట్‌ఫోలియోలో ఉంచడం లాజికల్ నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు.
మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు
ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం,జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ రేట్ల నిర్ణయాలు బంగారం డిమాండ్‌ను ప్రభావితం చేస్తున్నాయి. పెట్టుబడిదారులు డాలర్ బలహీనతను లాభంగా తీసుకొని బంగారం వైపు మళ్లుతున్నారు. ముఖ్యంగా చైనా, రష్యా, టర్కీ వంటి దేశాలు తమ ఫారెక్స్ నిల్వల్లో Gold వాటాను పెంచుతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే బంగారం మార్కెట్ 2026 వరకు పెరుగుదల దిశలోనే కొనసాగవచ్చని జె.పి. మోర్గాన్ అంచనా వేస్తోంది. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, పెట్టుబడిదారుల సురక్షిత ఆశ్రయం వెతకడం, ప్రపంచ ఆర్థిక అస్థిరత అన్నీ కలిపి బంగారం ధరలకు మద్దతు ఇస్తున్నాయి. భవిష్యత్తులో ధరలు మరింత పైకి వెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications