గత పది సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు అపూర్వ స్థాయికి చేరాయి. ఈ ర్యాలీ భారతదేశానికి ఎన్నడూ లేని విధంగా విపరీతమైన లాభాలను తెచ్చింది. ప్రస్తుతానికి 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,310 వద్ద ఉంది. ఈ రేట్ల ప్రకారం భారతదేశం మొత్తం బంగారం నిల్వల నుంచి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), దేశంలోని కుటుంబాల వద్ద ఉన్న బంగారం మొత్తం కలిపి రూ.30 లక్షల కోట్లు లేదా 3.29 ట్రిలియన్ల డాలర్లకు పైగా విలువ కలిగి ఉన్నాయి. ఇది అనేక దేశాల వార్షిక GDP కంటే చాలా ఎక్కువ. అలాగే భారతదేశం వద్ద ఉన్న మొత్తం ఫారెక్స్ రిజర్వుల కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 879.58 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. ఇది ఇప్పటివరకు RBI దగ్గర ఉన్న అత్యధిక నిల్వగా చెప్పుకోవచ్చు. 2025 సెప్టెంబర్ 30 నాటికి.. ఈ బంగారం విలువ రూ.10.28 లక్షల కోట్లు (115.7 బిలియన్ డాలర్లు). గత సంవత్సరం ఇదే నిల్వ విలువ కేవలం రూ. 2.74 లక్షల కోట్లు మాత్రమే. అంటే కొనుగోళ్లు ఎక్కువ చేయకపోయినా, ధరల పెరుగుదల వల్లే 275 శాతం పెరుగుదల నమోదైంది.

ఇది RBIకి దశాబ్దాల తర్వాత వచ్చిన అతిపెద్ద లాభంగా చెప్పవచ్చు. ముఖ్యంగా, ఇందులో ఎలాంటి కరెన్సీ రిస్క్ లేకపోవడం గమనార్హం. భారతదేశం ఫారెక్స్ నిల్వలలో Gold వాటా గత సంవత్సరం 8 నుంచి 9 శాతం మాత్రమే ఉండగా.. ఇప్పుడు అది 12.5 శాతం దాటింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..RBI గత మూడు నెలల్లో ఒక్క గ్రాము బంగారం కూడా కొనలేదు. 2024 వరకు దూకుడుగా కొనుగోళ్లు చేసిన తర్వాత 2025 జూన్‌లో RBI కొనుగోళ్లు ఆపేసింది. అలాగే మరింత అనుకూలమైన ధరల కోసం వేచి ఉంది.
RBI బంగారం నిల్వలు ఎంతటి విలువ కలిగినా.. అసలు కథ అంతా భారతీయ కుటుంబాల వద్దే ఉంది. నిపుణులు అంచనాల ప్రకారం దేశంలోని కుటుంబాలు 25 వేల టన్నుల Gold కలిగి ఉన్నాయి. ఇది మొత్తం దేశ బంగారు నిల్వలలో 95 శాతం కంటే ఎక్కువ. ప్రస్తుత ధరల ప్రకారం ఈ ప్రైవేట్ నిల్వ విలువ రూ. 29.21 లక్షల కోట్లు (3.29 ట్రిలియన్లు డాలర్లు). ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారం నిల్వగా నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ప్రపంచంలోని టాప్ 10 సెంట్రల్ బ్యాంకుల బంగారు నిల్వలన్నింటిని కలిపినా, భారతీయ కుటుంబాల బంగారం నిల్వలు వాటిని మించి ఉంటాయి.
భారతదేశంలో బంగారం ఒక సంప్రదాయం. పెళ్లిళ్లు, వరకట్నం, పండుగలు ఇలా ప్రతి సందర్భంలో బంగారం అనివార్యం. ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కోసం కూడా ప్రజలు తరతరాలుగా బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఇప్పుడు ఇది కేవలం ఆభరణం కాదు, ఒక వ్యూహాత్మక ఆర్థిక బఫర్ గా నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో మొత్తం 25,800 టన్నుల బంగారం ఉంది. ఇది చైనా (18,000 టన్నులు), అమెరికా (12,700 టన్నులు), జర్మనీ (12,440 టన్నులు) కంటే చాలా ఎక్కువ.
చాలా దేశాలు ప్రభుత్వ బంగారు నిల్వలపైనే ఆధారపడతాయి. కానీ భారతదేశం బలం ఏంటంటే ప్రజల లాకర్లు, కుటుంబాల ఖజానాలు, ఆభరణాల పెట్టెల్లో దాచుకున్న బంగారంలోనే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే.. దశాబ్ద కాలంలో బంగారం ధరల పెరుగుదల భారతదేశానికి ఒక రూ.30 లక్షల కోట్ల పసిడి వరం అందించింది. RBIకి ఊహించని లాభాలు వచ్చాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications