గోల్డ్ 90% పెరిగిందంటే చిన్న విషయం కాదు! రెండు ఏళ్లలో బంగారంలో పెట్టిన పెట్టుబడిని డబుల్ చేసుకున్నారు. డాలర్ బలహీనమవ్వడం, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొంటూనే ఉండడం, గ్లోబల్ టెన్షన్స్ ఇలా అన్నీ కలిపి గోల్డ్‌ని రాకెట్‌లా దూసుకెళ్తున్నాయి. రెండు సంవత్సరాల్లో డబుల్ అవుతున్నట్టు. 2024లోనే 27% పెరిగిన బంగారం, 2025లో ఇప్పటివరకు మరో 37% ఎగబాకింది. వడ్డీ ఇవ్వకపోయినా, "సేఫ్ హావెన్" (సురక్షిత పెట్టుబడి)గా బంగారం విలువ ఎప్పుడూ పీక్‌లో ఉంటుంది. కానీ ప్రశ్న ఏంటంటే ఇంకా $4,000 దాకా ఎగురుతుందా? లేక కాస్త ఆగిపోతుందా? రాబోయే నెలల్లో ఇదే చూడాలి.

ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గించే సంకేతాలు ఇస్తోంది. ఉద్యోగ మార్కెట్ బలహీనపడుతోంది. ఇవన్నీ బంగారానికి పెద్ద పాజిటివ్ ఫాక్టర్స్. నిపుణుల చెబుతున్నది ఒక్కటే గోల్డ్ రేట్లు ఇప్పుడే బుల్ ట్రెండ్‌లో ఉన్నాయ్. కానీ పెద్ద షాక్ లేకుండా ఒక్కసారిగా $4,000 దాకా ఎగిరిపోవడం కష్టం అంటున్నారు.
2022 నుంచి ప్రతి సంవత్సరం సెంట్రల్ బ్యాంకులు 1,000 టన్నులకుపైగా బంగారం కొంటున్నాయి. ఈ ఏడాది కూడా దాదాపు 900 టన్నులు కోనచ్చు అని అంచనా. ఎందుకంటే, అమెరికా డాలర్‌పై ఆధారాన్ని తగ్గించుకోవాలన్న ప్లాన్‌తో డెవలపింగ్ దేశాలు బంగారం వైపు దూసుకెళ్తున్నాయి. రష్యాపై ఆంక్షల వల్ల ఫారెన్ కరెన్సీ రిజర్వులు ఫ్రీజ్ అయిన సంఘటన ఈ మార్పుకు పెద్ద పాఠమైంది.
2010లలో మొత్తం సెంట్రల్ బ్యాంకుల వాటా 10-12% మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అది 23%కి చేరింది!
గోల్డ్ ETFలు:
ఇంకో ఇంట్రస్టింగ్ ట్రెండ్ గోల్డ్ ETFలు. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్యలోనే 397 టన్నుల ఇన్‌ఫ్లోస్ వచ్చాయి. ఇది 2020 తర్వాత అతి పెద్ద రికార్డు.
జూన్ చివరికి ETFల్లో 3,615 టన్నుల హోల్డింగ్స్ ఉన్నాయి. 2019లో రికార్డు స్థాయి 3,915 టన్నులకు చాలా దగ్గరగా ఉన్నాయి.
మెటల్స్ ఫోకస్ అంచనా ప్రకారం, 2025లో ETFలలో 500 టన్నుల నికర పెట్టుబడి రావచ్చు. గత ఏడాది మాత్రం 7 టన్నుల అవుట్ ఫ్లోస్ వచ్చాయి. అంటే ఇన్వెస్టర్లు ఇప్పుడు మళ్లీ బంగారాన్ని హాట్ అసెట్‌గా చూసేస్తున్నారు.
ఇంకా ఏమి బూస్ట్ ఇస్తాయంటే:
మన దగ్గర పండగలు, వెడ్డింగ్స్ సీజన్ మొదలవుతుంది. ఈ టైంలో గోల్డ్ డిమాండ్ ఎప్పుడూ పీక్‌లో ఉంటుంది. చైనా & ఇండియా దేశాలు గ్లోబల్ గోల్డ్ కన్జంప్షన్‌లో హాఫ్ వాటా కలిగివున్నాయి కాబట్టి, వారి డిమాండ్ పెరిగితే గోల్డ్ ప్రైస్‌పై డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది.
2025లో అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎవరు గెలుస్తారు, పాలసీలు ఏవిధంగా మారుతాయి అన్న క్లారిటీ వచ్చే వరకు మార్కెట్లో అన్‌సర్టైంటీ తప్పదు. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు సేఫ్ హావెన్‌గా గోల్డ్ వైపు మళ్లడం కామన్. పైగా, గ్లోబల్ పొలిటిక్స్‌లో కూడా టెన్షన్స్ పెరుగుతున్నాయి. ఇవన్నీ గోల్డ్‌కి పాజిటివ్ ఫ్యాక్టర్స్.
స్టాక్ మార్కెట్ ఒక్క షాక్‌తో గణనీయంగా పడిపోవచ్చు. కానీ గోల్డ్ మాత్రం అటువంటి టైంలో ఇన్వెస్టర్లకు సేఫ్ హార్బర్‌గా ఉంటుంది. అందుకే మార్కెట్‌లో పెద్ద వోలాటిలిటీ వస్తే, బంగారానికి డిమాండ్ డైరెక్ట్‌గా బూస్ట్ అవుతుంది.
సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేస్తూనే ఉన్నాయి, ETFలు రికార్డు స్థాయిలో డిమాండ్ సృష్టిస్తున్నాయి, గ్లోబల్ పొలిటికల్ టెన్షన్స్ కూడా తగ్గట్లేదు. ఇవన్నీ కలిపి చూస్తే, రాబోయే నెలల్లో బంగారం ధరలు బలంగా ఉండే ఛాన్స్ ఎక్కువ. $4,000 వెంటనే కాకపోయినా, ఇన్వెస్టర్లకు గోల్డ్ పెట్టుబడి "సేఫ్ సైడ్ గ్యారంటీ"గా కనబడుతోంది.
మొత్తానికి చెప్పాలంటే, ఈ ఫెస్టివల్ సీజన్‌లో చాలా మంది జువెలరీ కోసం బంగారం కొనుగోలు చేస్తున్నారు. కానీ నిజానికి లాభం మాత్రం ఇన్వెస్ట్‌మెంట్‌గా గోల్డ్ పెట్టే వాళ్లకే ఎక్కువ. జువెలరీ కొంటే మేకింగ్ ఛార్జీలు, వాడేటప్పుడు వచ్చే ఖర్చులు ఇలా అన్నీ కలిపితే అసలు రిటర్న్ తగ్గిపోతాయి. కానీ అదే డబ్బు గోల్డ్ ETFలు లేదా గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో పెడితే మార్కెట్ పెరుగుదలతో రిటర్న్స్ నేరుగా మీకు వస్తాయి. అంటే ఈ సీజన్‌లో షాపింగ్ కంటే ఇన్వెస్ట్‌మెంట్‌లో బంగారం పెట్టిన వాళ్లకే అసలైన గోల్డ్ లాభం దొరుకుతుంది.
More From GoodReturns

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications