బంగార ధర పెరగడానికి 5 ప్రధాన కారణాలు ఇవే.. వచ్చే వారం రూ. లక్షా 10 వేలకు పసిడి ధర..
బంగారం మరోసారి అల్ టైం రికార్డులను బద్దలు కొడుతోంది. MCXలో బంగారం 10 గ్రాములకు రూ. 1,02,600 వద్దకు చేరింది.దీంతో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దీనికి ప్రధాన కారణం డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం, ప్రపంచ పరిస్థితి కారణంగా పెరిగిన అనిశ్చితి వంటివి ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం ధర మరింత పెరగవచ్చు. అయితే ప్రపంచ ఉద్రిక్తతలు కొంచెం తగ్గితే, రూ. 1,00,350 దగ్గర బంగారం ధర ఆగిపోయే అవకాశం ఉంది.
బంగారం పెరగడానికి ప్రధాన కారణాలను మనం విశ్లేషించుకుంటే.. మొదటిది కారణంగా.. రూపాయి రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకోవడంగా చెప్పవచ్చు డాలర్‌తో పోలిస్తే ఇది రూ. 88.15కి బలహీనపడింది. దీని కారణంగా బంగారం ధరలు పెరిగాయి. ఇక రెండవ కారణంగా..రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలను చూడవచ్చు.ప్రస్తుతం కాల్పుల విరమణపై అనిశ్చితి కొనసాగుతోంది. మూడవ కారణం ఏంటంటే.. సుంకాల యుద్ధంగా చూడవచ్చు. ట్రంప్ హెచ్చరిక ప్రభావం కనిపించక పోవడంతో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది.

నాల్గవ కారణం ఏంటంటే.. చైనా దూకుడుగా బంగారాన్ని కొనుగోలు చేయడం. చైనా నిరంతరం బంగారు నిల్వలను పెంచుకుంటూ పోతోంది. దీంతో బంగారంకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. ఐదవ కారణంగా US ద్రవ్యోల్బణం, రేటు తగ్గింపు అంచనాలను చూడవచ్చు. సెప్టెంబర్‌లో రేటు తగ్గింపు అంచనా ద్వారా Gold ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు Gold మరోసారి సురక్షితమైన స్వర్గధామ ఆస్తిగా కనిపిస్తోంది.
రూపాయిలో బలహీనత కొనసాగితే.. ప్రపంచ యుద్ధ-వాణిజ్య ఉద్రిక్తత పెరిగితే బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముందు ముందు ఇది 1,03,500 స్థాయిని దాటి రూ. లక్షా 10 వేలకు పైగా చేరవచ్చు. బంగారం ఆభరణాలకు మాత్రమే కాదు, అనిశ్చిత సమయాల్లో సురక్షితమైన పెట్టుబడి కూడా. అందువల్ల.. దానిలో క్రమంగా పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ రికార్డు స్థాయిలో కొనుగోలు చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండటం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
అధిక ధరల కారణంగా బంగారం మీద తక్షణ లాభాలు ఆశించడం కష్టం. కానీ దీర్ఘకాలంలో బంగారం మీ సంపదను కాపాడే సురక్షిత పెట్టుబడి అని నిపుణులు చెబుతున్నారు. పండుగల ముందు కొంత స్మార్ట్ బయ్యింగ్ చేయవచ్చు.ఇక వెండిని చూసినట్లయితే పరిశ్రమల డిమాండ్ బలంగా ఉండటంతో వెండికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయి. మధ్య-దీర్ఘకాలిక పెట్టుబడిగా వెండి పోర్ట్‌ఫోలియోలో భాగం కావచ్చని చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications