డిసెంబర్ 2025లో బంగారం ధరలు సంవత్సరాంత ర్యాలీలో దూసుకుపోయాయి. అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ బలహీనత, ప్రపంచ ఆర్థిక రిస్క్‌పై అంచనాలను వ్యాపారులు తిరిగి అంచనావేయడంతో స్పాట్ గోల్డ్ ధరలు ఔన్సుకు 4,200 డాలర్ల నుంచి 4,300 డాలర్ల జోన్ పైన స్థిరంగా కొనసాగుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ తాజా విధాన నిర్ణయం.. వెండి రికార్డు స్థాయి పెరుగుదల, అలాగే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) నుంచి వచ్చిన బబుల్ హెచ్చరిక.. ఈ మూడు అంశాలు కలిపి బంగారం మార్కెట్‌ను అధిక అస్థిరత దిశగా నడిపిస్తున్నాయి.
డిసెంబర్ రెండో వారంలో బంగారం ధరలు ఏడు వారాల గరిష్టాలను తాకాయి. డిసెంబర్ 15న స్పాట్ గోల్డ్ సుమారు 4,293 డాలర్లకు పైగా ట్రేడవ్వగా, అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 4,328 కి పైగా చేరాయి. ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం తర్వాత డాలర్ ఎనిమిది వారాల కనిష్టానికి పడిపోవడం బంగారానికి మద్దతుగా మారింది. సాంకేతికంగా కూడా వారంలో దాదాపు 3 శాతం లాభంతో బంగారం బలమైన స్థితిని చూపిస్తోంది.

ఈ నెలలో బంగారం ధరలను ప్రభావితం చేసిన ప్రధాన అంశం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతని ప్రదానంగా చెప్పవచ్చు. డిసెంబర్ 10న ఫెడ్ 25 బేసిస్ పాయింట్ల కోతతో వడ్డీ రేట్లను 3.50 శాతం నుండి3.75 శాతం పరిధికి తగ్గించింది. అయితే ఈ నిర్ణయం ఏకగ్రీవంగా కాకపోవడం గమనార్హం. కొందరు అధికారులు పెద్ద తగ్గింపును ఆశించగా మరికొందరు ఎలాంటి మార్పు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఈ విభజన మార్కెట్‌లో అనిశ్చితిని పెంచింది. సాధారణంగా అలాంటి పరిస్థితులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.
వడ్డీ చెల్లించని ఆస్తి Gold కావడంతో, వడ్డీ రేట్లు తగ్గినప్పుడు దాని ఆకర్షణ పెరుగుతుంది. అయితే ఫెడ్ భవిష్యత్తు చర్యలపై స్పష్టత ఇవ్వకపోవడంతో, ప్రతి ముఖ్యమైన ఆర్థిక డేటా విడుదల బంగారం ధరల్లో వేగవంతమైన కదలికలకు దారితీసే అవకాశం ఉంది.
ఇదే సమయంలో BIS ఇచ్చిన హెచ్చరిక మార్కెట్ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా ఈక్విటీ మార్కెట్లలో ఒకేసారి ధరల తగ్గుదల సూచన కనిపిస్తోందని BIS విశ్లేషణ పేర్కొంది. ఇది వెంటనే ధరలు పడిపోతాయనే అర్థం కాకపోయినా.. లాభాల స్వీకరణతో ఆకస్మిక పుల్‌బ్యాక్‌లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతోంది. ముఖ్యంగా సెలవుల సీజన్‌లో లిక్విడిటీ తగ్గినప్పుడు ఈ అస్థిరత మరింత ఎక్కువగా ఉండొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
అయితే దీర్ఘకాలిక డిమాండ్ బంగారానికి బలమైన మద్దతుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ నిల్వలను పెంచుకుంటుండగా, భౌగోళిక రాజకీయ అనిశ్చితి కూడా బంగారం వైపు పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2025లో ఇప్పటికే Gold 60 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చి, అనేక ఆల్‌టైమ్ హైలను నమోదు చేసింది. సాంకేతికంగా చూస్తే 4,200 డాలర్ల కీలక మద్దతు స్థాయిగా ఉండగా.. 4,350 నుంచి 4,400 డాలర్ల మధ్య ముఖ్య నిరోధక ప్రాంతంగా కనిపిస్తోంది. ఈ స్థాయిల మధ్యే డిసెంబర్ మిగతా రోజుల్లో బంగారం ఊగిసలాడే అవకాశం ఉంది.
క్లుప్తంగా చెప్పాలంటే డిసెంబర్ 2025లో బంగారం ట్రెండ్ బుల్లిష్‌గా ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో పెద్ద హెచ్చుతగ్గులు తప్పవు. ఫెడ్ విధానం, డాలర్ కదలికలు, అలాగే BIS హెచ్చరికల నేపథ్యంలో, బంగారం కొత్త గరిష్టాలను పరీక్షించగలిగినా, అవసరమైతే 4,200 డాలర్ల వైపు పుల్‌బ్యాక్ కూడా చూడవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications