బంగారం కొనుగోలుపై నిపుణులు కీలక సూచన.. పసిడి ధరలు ఇంకా కుప్పకూలబోతున్నాయంటున్న ప్రముఖ బ్యాంకు..

Gold Prices Under Pressure: ఈ ఏడాది (2026) ప్రారంభంలో ఆకాశాన్నంటిన బంగారం, వెండి ధరలు ఆ తర్వాత తీవ్రమైన పతనాన్ని చవిచూడటంతో మదుపర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. దేశీయ మార్కెట్లో బంగారం జనవరి నాటి రికార్డు గరిష్ఠ స్థాయి నుండి ఇప్పటివరకు 23 శాతానికి పైగా క్షీణించగా.. వెండి ఏకంగా 55 శాతం మేర కుప్పకూలింది. అంతర్జాతీయ కామెక్స్ (COMEX) మార్కెట్లోనూ 2026లో ఇప్పటివరకు బంగారం సుమారు 10.5 శాతం నష్టపోయి.. 2013 తర్వాత అత్యంత దారుణమైన సంవత్సరంగా నిలిచే దిశగా పయనిస్తోంది.

దేశీయ గణాంకాలను పరిశీలిస్తే.. ఈ ఏడాది జనవరి చివరలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1.80 లక్షల రికార్డు స్థాయిని తాకింది. అక్కడి నుండి క్రమంగా దిగివస్తూ రూ. 1.40 లక్షల కీలక స్థాయిని కోల్పోయి.. ప్రస్తుతం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాములకు సుమారు రూ. 1,34,900 వద్ద ట్రేడవుతోంది.

gold prices gold price forecast gold price prediction 2028 Goldman Sachs gold forecast gold price today gold market outlook gold prices fall gold price decline gold price weakness gold rally gold price target 5600 gold 5600 by 2028 gold investment outlook 2028

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం కూడా 10 గ్రాముల ధర రూ. 1,34,970 వద్ద నమోదైంది. ఇక వెండి పరిస్థితి మరింత బలహీనంగా మారింది. 2026 జనవరి 29న ఎంసీఎక్స్‌లో కిలోకు రూ. 4,20,048 వద్ద ఆల్-టైమ్ రికార్డు సృష్టించిన వెండి.. ప్రస్తుతం 55 శాతం పడిపోయి కిలోకు సుమారు రూ. 1.70 లక్షల స్థాయికి చేరుకుంది. ఐబీజేఏ గణాంకాల ప్రకారం కిలో వెండి ధర రూ. 1,69,280 వద్ద కొనసాగుతోంది.

ఈ భారీ పతనానికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానం, బలపడుతున్న యూఎస్ డాలర్ అని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది జనవరి చివరలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాల నడుమ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సుకు సుమారు 5,595 డాలర్ల రికార్డు స్థాయికి చేరింది.

కానీ ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ పెరగడంతో ఫెడ్ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందనే అంచనాలు బలపడ్డాయి. బంగారం ఎటువంటి వడ్డీని చెల్లించని ఆస్తి కావడంతో.. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ప్రభుత్వ బాండ్లు, ఇతర వడ్డీ ఆదాయ సాధనాల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా పసిడికి పెట్టుబడి డిమాండ్ తగ్గి ధరలపై ఒత్తిడి పెరిగింది.

Also Read

రాబోయే రోజుల్లో స్వల్పకాలిక ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Giottus.com సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్ అభిప్రాయం ప్రకారం.. బంగారం కీలక సాంకేతిక మద్దతు స్థాయిలను కోల్పోయినందున సమీప భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశాన్ని తోసిపుచ్చలేమన్నారు.

అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్సుకు 3,850 డాలర్లు తక్షణ మద్దతుగా ఉందని.. ఒకవేళ దీనికంటే దిగువకు జారితే 3,700 డాలర్లు, 3,500 డాలర్ల వద్ద తదుపరి మద్దతు లభించవచ్చని ఆయన వివరించారు. ఒకవేళ ధరలు పుంజుకుంటే 4,000, 4,200 డాలర్ల వద్ద నిరోధకం (Resistance) ఎదురవుతుంది. దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారానికి రూ. 1,30,000, రూ. 1,25,000 స్థాయిలు కీలక మద్దతుగా ఉండగా.. ఎగువ స్థాయిలో రూ. 1,42,000, రూ. 1,45,000 వద్ద నిరోధకం ఉంది.

అయితే స్వల్పకాలంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక దృక్పథం ఆశాజనకంగానే ఉందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తిరిగి వడ్డీ రేట్ల తగ్గింపు చక్రాన్ని ప్రారంభించిన తర్వాత బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటాయని.. 2028 చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకు 5,600 డాలర్ల రికార్డు స్థాయికి తిరిగి చేరుకోవచ్చని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేస్తోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+